Minmini Movie:ఫస్ట్ హాఫ్ 2015లో - సెకండ్ హాఫ్ 2022లో - షూటింగ్‌కు కావాలనే ఏడేళ్లు గ్యాప్ తీసుకున్న తమిళ మూవీ
Minmini Movie: దృశ్యం ఫేమ్ ఎస్తేర్ అనిల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ మూవీ మిన్‌మినీ ఫస్ట్ హాఫ్‌ను 2015లో షూట్ చేయగా సెకండాఫ్‌ను 2022 లో తెరకెక్కంచారు. కారణం ఏమిటంటే?
Minmini Movie: దృశ్యం మూవీలో మోహన్‌లాల్ కూతురిగా కనిపించింది ఎస్తేర్ అనిల్. దృశ్యం తెలుగు రీమేక్‌లోనూ సేమ్ రోల్‌లో నటించి మెప్పించింది. ఎస్తేర్ అనిల్ ప్రధాన పాత్రలో తమిళంలో మిన్‌మినీ పేరుతో ఓ మూవీ తెరకెక్కింది. హలీతా షమీమ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ మూవీలో హరికృష్ణన్ కీలక పాత్రలో నటించాడు.

చైల్డ్ హుడ్ నుంచి టీనేజ్...
చైల్డ్ హుడ్ నుంచి టీనేజ్ వరకు ఓ జంట కలిసి సాగించిన జర్నీ నేపథ్యంలో దర్శకురాలు మిన్‌మినీ మూవీని తెరకెక్కించింది. ప్రధాన పాత్రల బాల్యాన్ని, టీనేజ్‌ను వాస్తవిక కోణంలో సినిమాలో ప్రజెంట్ చేయాలని డైరెక్టర్ భావించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌ను 2015లో షూట్ చేసింది. ఆ తర్వాత యాక్టర్స్ చైల్డ్‌హుడ్ నుంచి టీనేజ్‌కు మారిన తర్వాత సెకండాఫ్‌ను షూట్ చేయాలని ఏకంగా ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నది. సెకండాఫ్‌ను 2022లో కంప్లీట్ చేసింది.
రియల్ ఏజ్ ప్రకారం షూటింగ్...
యాక్టర్స్‌ను మార్చకుండా వారి రియల్ ఏజ్ ప్రకారం షూటింగ్‌ను జరుపుకున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా మిన్‌మినీ నిలిచింది. అంతే కాకుండా ఎక్కువ రోజుల పాటు షూటింగ్‌ను జరుపుకున్న ఇండియన్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది.
తమిళనాడు నుంచి లఢఖ్...
ఇద్దరు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ తమిళనాడు నుంచి లఢక్ వరకు కలిసి సాగించిన బైక్ జర్నీ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. తన ప్రేమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సాగించిన ఈ జర్నీలో ఎదురైన అనుభవాలు, అనుభూతులను దర్శకురాలు హృద్యంగా ఈ మూవీలో ఆవిష్కరించింది. ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్ ఊటీ నేపథ్యంలోసాగుతుంది. సెకండాఫ్ మాత్రం లఢఖ్, జమ్ము కశ్మీర్ అందాలను చూపిస్తూ నడిపించారు దర్శకురాలు.
యూట్యూబ్‌లో వైరల్...
2023లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇందులో పాటలు మాత్రం యూట్యూబ్‌లో వైరల్ అయ్యాయి. ఈ సినిమాతో ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ మ్యూజిక్ అందించింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇదే ఆమెకు ఫస్ట్ మూవీ.
దృశ్యం మూడు భాషల్లో...
మలయాళంలో ఇరవైకిపైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎస్తేర్ అనిల్ నటించింది. తెలుగులో దృశ్యం, దృశ్యంతో పాటు జోహార్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. దృశ్యం తమిళ వెర్షన్ పాపనాశంలోనూ ఎస్తేర్ అనిల్ నటించింది. మూడు భాషల్లో ఈ మూవీ పెద్ద హిట్టయ్యింది.
మలయాళంలో టాప్ సింగర్ అనే టీవీ షోకు ఎస్తేర్ అనిల్ చాలా కాలం పాటు హోస్ట్‌గా పనిచేసింది. సింగింగ్ రియాలిటీ షోస్‌లో మలయాళంలో పాపులర్ షోస్‌లో ఒకటిగా టాప్ సింగర్ నిలిచింది.