తెలుగులో హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మూవీ ఎర్రచీర - ది బిగినింగ్. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎర్రచీర - ది బిగినింగ్ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్ర పోషించింది.
"ఎర్రచీర - ది బిగినింగ్" సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. హార్రర్, యాక్షన్‌కు మదర్ సెంటిమెంట్ యాడ్ చేసిన స్టోరీగా ఈ చిత్రం ఎర్రచీర రూపొందింది. తాజాగా ఎర్రచీర ది బిగినింగ్ సినిమాకు సెన్సార్ పనులు పూర్తయ్యాయి.
అయితే ఈ సినిమాలో హారర్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఎర్రచీర చూసిన సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎర్రచీర డైరెక్టర్ సుమన్ బాబు మాట్లాడుతూ.. "హార్ట్ పేషంట్స్ ఈ సినిమాను చూడటానికి వచ్చినప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని రావలి" అని తెలిపారు.
ఎర్రచీర సెన్సార్ పనుల పూర్తయిన సందర్భంగా చిత్ర నిర్మాతలో ఒకరైన ఎన్‌వివి సుబ్బారెడ్డి (సుభాష్) మాట్లాడుతూ.. "ఎర్రచీర మూవీ కంటెంట్ డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఈ సినిమాని కార్తీక మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ హైలెట్‌గా నిలుస్తాయి" అని అన్నారు.
అంటే, ఎర్రచీర సినిమాను కార్తీక మాసంలో అక్టోబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఎర్రచీర సినిమాలో బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఇకపోతే ఇంతకుముందు ఎర్రచీర సినిమాపై హరి హర వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ ప్రశంసలు కురిపించారు. ఎర్రచీర ట్రైలర్‌ను వీక్షించిన దర్శకుడు జ్యోతి కృష్ణ మూవీని కొనియాడారు. ఎర్రచీర ట్రైలర్ చాలా బాగుందని, సినిమాను కచ్చితంగా థియేటర్లలో చూడాలని, ఎర్రచీర సినిమా మంచి విజయం సాధించాలని జ్యోతి కృష్ణ తెలిపారు.
సంబంధిత కథనం