Enno Ratrulosthayi Video Song: వింటేజ్ ఫీల్‌ను తీసుకొస్తున్న సాంగ్.. బాలయ్యను మరిపిస్తున్న కల్యాణ్ రామ్-enno ratrulosthayi song released from kalyan ran amigos movie trending on youtube ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Enno Ratrulosthayi Video Song: వింటేజ్ ఫీల్‌ను తీసుకొస్తున్న సాంగ్.. బాలయ్యను మరిపిస్తున్న కల్యాణ్ రామ్

Enno Ratrulosthayi Video Song: వింటేజ్ ఫీల్‌ను తీసుకొస్తున్న సాంగ్.. బాలయ్యను మరిపిస్తున్న కల్యాణ్ రామ్

Maragani Govardhan HT Telugu
Feb 01, 2023 07:57 AM IST

Enno Ratrulosthayi Video Song: నందమూరి కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం అమిగోస్. ఈ సినిమా నుంచి ఎన్నో రాత్రులొస్తాయి పాటను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్ మారింది. అంతేకాకుండా ఈ రీమిక్స్ సాంగ్ వింటేజ్ ఫీల్‌ను తీసుకొస్తోంది.

అమిగోస్ చిత్రం నుంచి ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ రీమిక్స్
అమిగోస్ చిత్రం నుంచి ఎన్నో రాత్రులొస్తాయి సాంగ్ రీమిక్స్

Enno Ratrulosthayi Video Song: నందమూరి కల్యాణ్ రామ్ గతేడాది బింబిసారతో అదిరిపోయే హిట్‌ను తన సొంతం చేసుకున్నాడు. దీంతో తన తదుపరి చిత్రంపై అభిమానుల్లో ఫుల్ బజ్ ఏర్పడింది. కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన అమిగోస్ చిత్రం నుంచి సరికొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. బాలయ్య సూపర్ హిట్ పాటల్లో ఒకటిగా నిలిచిన ఎన్నో రాత్రులొస్తాయి కానీ.. అనే పాటను రీమిక్స్ చేశారు. తాజాగా ఈ పాటను విడుదల చేయగా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

యూట్యూబ్‌లో ఈ పాటను ఇప్పటికే 1.5 మిలియన్ మంది చూశారు. కల్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ నటించిన ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. బాలకృష్మ మరిపిస్తూ కల్యాణ్ రామ్ ఆకట్టుకున్నాడు. రొమాంటిక్‌గా ఉన్న ఈ సాంగ్ వింటేజ్ ఫీల్‌ను కలిగిస్తుంది. నందమూరి బాలకృష్ణ 1992లో నటించిన ధర్మక్షేత్రం సినిమాలోని ఈ సాంగ్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. తాజాగా అదే పాటను నేటి యువతరానికి చేరువ చేసే ప్రయత్నం చేశారు కల్యాణ్ రామ్.

పాత పాటకు ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చగా.. ఎస్పీ బాలు, చిత్రం అద్భుతంగా ఆలపించారు. వీరి గాత్రానికి, ఇళయా రాజా సంగీతం, వేటూరి రొమాంటిక్ పదాలు చేరువై శ్రోతలను విపరీతంగా అలరించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను విన్న చాలా మంది రాజా, బాలు, చిత్రపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. అమిగోస్ చిత్రం కోసం మళ్లీ ఈ పాటను సంగీత దర్శకుడు జీబ్రాన్ రీమిక్స్ చేశాడు. ఎస్పీ బాలు స్థానంలో ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, సమీర భరద్వాజ్ ఆలపించారు. వేటూరి సాహిత్యాన్ని యాధావిధిగా ఉంచడంతో మళ్లీ ఈ సాంగ్‌ను వింటేజ్ ఫీల్ వచ్చింది.

రొమాంటిక్ మెలోడీగా సాగే ఈ పాటను కల్యాణ్ రామ్, ఆషిక రంగనాథ్ తమ స్టైలిష్ స్టెప్పులతో అలరించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. కన్నడ బ్యూటీ ఆషిక అయితే తన అందంతో యువతరాన్ని కట్టిపడేస్తోంది. అంతేకాకుండా తన రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌ సాంగ్.. రీమిక్స్ చేసినా ఒరిజినల్ ఫీల్ పోకుండా సక్సెస్ సాధించింది చిత్రబృందం.

అమిగోస్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ యెర్నీని, వై రవిశంకర్ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజేంద్ర రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నటి అషికా రంగనాథ్ తెలుగులోకి ఈ సినిమా ద్వారా అరంగేట్రం చేస్తోంది. జీబ్రాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత కథనం

టాపిక్