OTT Trending: థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్.. ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్.. స్ట్రీమింగ్‍లో అదరగొడుతున్న సినిమా-emergency ott streaming kangana ranaut movie trending top in netflix emergency film on ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Trending: థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్.. ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్.. స్ట్రీమింగ్‍లో అదరగొడుతున్న సినిమా

OTT Trending: థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్.. ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్.. స్ట్రీమింగ్‍లో అదరగొడుతున్న సినిమా

Emergency OTT Streaming: ఎమర్జెన్సీ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. థియేటర్లలో భారీ డిజాస్టర్ అయిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది. ట్రెండింగ్‍లో దూసుకొచ్చేసింది.

OTT Trending: థియేటర్లలో అల్ట్రా డిజాస్టర్.. ఓటీటీలో ట్రెండింగ్‍లో టాప్.. స్ట్రీమింగ్‍లో అదరగొడుతున్న సినిమా

బాలీవుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ మూవీపై ముందు నుంచి బజ్ నెలకొంది. ఈ మూవీపై వివాదాలు, అభ్యంతరాలు కూడా వినిపించాయి. 1975లో ఇండియాలో ఎమర్జెన్సీ విధించిన ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీలో మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను కంగనా రనౌత్ పోషించారు. అయితే, ఈ ఏడాది జనవరి 17వ తేదీన రిలీజైన ఎమర్జెన్సీ మూవీ డిజాస్టర్ అయింది. అయితే, ప్రస్తుతం ఓటీటీలో సత్తాచాటుతోంది.

టాప్‍లో ట్రెండింగ్

ఎమర్జెన్సీ మూవీ ప్రస్తుతం (మార్చి 16) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో టాప్‍లో ట్రెండ్ అవుతుంది. నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. ఈ మూవీ మార్చి 14వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఈ మూవీ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.

థియేటర్లలో డిజాస్టర్

ఎమర్జెన్సీ చిత్రానికి థియేటర్లలో నిరాశ ఎదురైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఏ మాత్రం వాటిని అందుకోలేకపోయింది. సుమారు రూ.60కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ కేవలం సుమారు రూ.20కోట్ల కలెక్షన్లనే దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్ అయింది. ఈ చిత్రానికి ముందు నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు మందకొడిగా వచ్చాయి. మొత్తానికి భారీ ప్లాఫ్ అయింది.

ఇందిరా గాంధీ పాత్ర చేసేందుకు కంగనా రనౌత్ మేకోవర్ పూర్తిగా మార్చేశారు. ఎమర్జెన్సీ చిత్రంలో నటనతో మెప్పించారు. అయితే, దర్శకురాలిగా ఈ చిత్రాన్ని ఇంట్రెస్టింగ్‍గా తెరకెక్కించటంలో మాత్రం సఫలం కాలేకపోయారు. ఈ చిత్రంలో నరేషన్ సరిగా లేదంటూ మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద జోరు చూపలేకపోయింది.

ఎమర్జెన్సీ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ పాత్రను అనుపమ్ ఖేర్ పోషించారు. శ్రేయస్ తల్పడే, మిలింద్ సోమన్, అవిజిత్ దత్, అశోక్ చాబ్రా, మహిమ చౌదరి, విశాఖ్ నాయర్, సతీశ్ కౌశిక్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని మణికర్ణిక ఫిల్మ్స్, జీస్టూడియోస్ పతాకాలపై కంగనా రనౌత్, రేణు పిట్టి ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్, ఆర్కో, సంచిత్ బల్హారా, అంకిత బల్హారా మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.

నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం తెలుగు మూవీ తండేల్ రెండో ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ మార్చి 7న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి వ్యూస్ సాధిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన తండేల్ ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజై రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటి సూపర్ హిట్ అయింది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం