Disaster Movies Trending On OTT: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అయితే, వాటి ఫలితాలు బాక్సాఫీస్ వద్ద ఒకలా, ఓటీటీలో మరోలా ఉంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో యావరేజ్‌గా నిలుస్తాయి.
అలాగే, థియేటర్లలో మంచి రెస్పాన్స్ లేక బొక్కబోర్లా పడ్డ మూవీస్ ఓటీటీలో మాత్రం దుమ్ముదులుపుతాయి. ఇప్పుడు రెండు సినిమాలపై ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ అలాగే ఉంది. ఈ ఏడాది ఒకే రోజు థియేటర్లలో విడుదలైన రెండు బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు అవి ఓటీటీ ట్రెండింగ్‌లో వరుసగా దూసుకుపోతున్నాయి.
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తొలిసారి దర్శకత్వం వహించిన హిస్టారికల్ పొలిటికల్ డ్రామా మూవీ ఎమర్జెన్సీ. కంగనా రనౌత్ కథ అందించి, ప్రధాన పాత్రలో నటించి, నిర్మాతగా వ్యవహరించిన ఎమర్జెన్సీ జనవరి 17న థియేటర్లలో విడుదలై ఫెయిల్యూర్‌గా మిగిలింది. జీ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాను సుమారుగా రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
కానీ, థియేటర్లలో విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎమర్జెన్సీ రూ. 21.75 నుంచి 22 కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 3 ట్రెండింగ్ ప్లేస్‌లో ఎమర్జెన్సీ దూసుకుపోతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీకి ఐఎమ్‌డీబీ 10కి 5.2 రేటింగ్ ఇచ్చింది.
ఇక ఇదే సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయి ప్లాప్‌గా నిలిచిన మరో హిందీ సినిమా ఆజాద్. పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఆజాద్ మూవీలో హిందీ అగ్ర హీరో అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ హీరోగా, రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా సినీ రంగప్రవేశం చేశారు.
స్టార్ కిడ్స్‌గా అమన్, రాషా బాలీవుడ్ డెబ్యూ చేసిన ఆజాద్ మూవీలో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపుగా రూ. 80 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. కానీ, జనవరి 17న థియేటర్లలో విడుదలైన ఆజాద్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 9.17 నుంచి 10 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి.
దాంతో ఎమర్జెన్సీ సినిమా కంటే ఆజాద్ భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అంతేకాకుండా ఆజాద్‌కు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 4.7 రేటింగ్ వచ్చింది. అంటే, ఇందులో కూడా ఎమర్జెన్సీ కంటే తక్కువే ఉంది. ఇక ఆజాద్ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ టాప్ 4 ట్రెండింగ్ స్థానంలో ఆజాద్ చోటు సంపాదించుకుంది. అంటే, బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అయిన ఆజాద్ ఓటీటీ ట్రెండింగ్‌లో దుమ్మురేపుతోంది.
ఇలా ఒకేరోజు థియేటర్లలో విడుదలైన ఎమర్జెన్సీ, ఆజాద్ ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 3, టాప్ 4 స్థానాల్లో వరుసగా ప్రస్తుతం ఓటీటీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. కాగా, మార్చి 14 నుంచి ఆజాద్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండగా.. మార్చి 17న సడెన్‌గా ఎమర్జెన్సీ ఓటీటీ రిలీజ్ అయింది.
సంబంధిత కథనం