Ed Sheeran: జూనియర్ ఎన్టీఆర్ పాట పాడిన పాపులర్ ఇంగ్లిష్ సింగర్.. మోతెక్కిన ఆడిటోరియం: వీడియో-ed sheeran sings jr ntr devara movie chuttamelle song in telugu at bengaluru ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ed Sheeran: జూనియర్ ఎన్టీఆర్ పాట పాడిన పాపులర్ ఇంగ్లిష్ సింగర్.. మోతెక్కిన ఆడిటోరియం: వీడియో

Ed Sheeran: జూనియర్ ఎన్టీఆర్ పాట పాడిన పాపులర్ ఇంగ్లిష్ సింగర్.. మోతెక్కిన ఆడిటోరియం: వీడియో

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 10, 2025 09:42 AM IST

Ed Sheeran - Chuttamelle song: పాపులర్ ఇంగ్లిష్ సింగర్ ఎడ్ షీరన్.. దేవర చిత్రంలోని పాట పాడారు. బెంగళూరు కాన్సెర్టులో తెలుగు పాటతో అదరగొట్టారు. దీంతో ఆడిటోరియం మోతెక్కిపోయింది.

Ed Sheeran: జూనియర్ ఎన్టీఆర్ పాట పాడిన పాపులర్ ఇంగ్లిష్ సింగర్.. మోతెక్కిన ఆడిటోరియం: వీడియో
Ed Sheeran: జూనియర్ ఎన్టీఆర్ పాట పాడిన పాపులర్ ఇంగ్లిష్ సింగర్.. మోతెక్కిన ఆడిటోరియం: వీడియో

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన దేవర మూవీ గతేడాది మంచి హిట్ కొట్టింది. ఈ చిత్రంలోని చుట్టమల్లే పాట చాలా పాపులర్ అయింది. ఇండియాలోనే కాకుండా గ్లోబల్‍గా ఈ సాంగ్ ఊపేసింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు పాపులర్ ఇంగ్లిష్ సింగర్ ఎడ్ షీరన్.. నోట చుట్టమల్లే పాట వచ్చింది.

ఉర్రూతలూగించిన చుట్టమల్లే

దేవర చిత్రంతో చుట్టమల్లే పాటను పాడిన శిల్పా రావుతో కలిసి ఈ పాటను పర్ఫార్మ్ చేశారు ఎడ్ షీరన్. బెంగళూరులో ఆదివారం జరిగిన కాన్సెర్ట్‌లో.. ఎందుకు పుట్టిందో.. పుట్టింది అంటూ తెలుగులో చుట్టమల్లే పాట పాడారు. శిల్పారావుతో కలిసి గొంతు కలిపారు షీరన్. వీరు పాట పాడుతుండగా ఆడిటోరియం దద్దరిల్లింది. ఈ సాంగ్‍లో అట్రాక్షన్ అయిన ‘ఆ’ అంటూ సౌండ్ చేస్తూ ప్రేక్షకులు కూడా అరిచారు.

బ్రిటీష్ యాసతో ఎడ్ షరీన్ నోట చుట్టమల్లే పాట డిఫరెంట్‍గా అనిపించింది. అతడు తెలుగు పాట పాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చుట్టమల్లే సాంగ్ గ్లోబల్‍లో ఎంత రీచ్ అయిందో అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇండియన్ మ్యూజిక్‍ను గౌరవిస్తూ పాట పాడిన షీరన్ మనసులు గెలుచున్నారంటూ చాలా మంది ప్రశంసిస్తున్నారు. శిల్పా రావుతో కలిసి చుట్టుమల్లే పాటను నేర్చుకున్న వీడియోను కూడా షీరన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

స్ట్రీట్ పర్ఫార్మెన్స్‌ను అడ్డుకున్న పోలీసులు

జనాలను సర్‌ప్రైజ్ చేసేందుకు బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్‍లో పర్ఫార్మ్ చేయాలని ఎడ్ షీరన్ అనుకున్నారు. కాన్సెర్ట్‌ కంటే ముందు స్ట్రీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే, అతడి ప్రదర్శనను బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదని, ఆపేయాలని గట్టిగా చెప్పారు. తాను ముందుగానే అనుమతి తీసుకున్నానని ఆ తర్వాత షీరన్ ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు. “మేం ముందుగానే అనుమతి పొందాం. అక్కడే పర్ఫార్మ్ చేయాలి మేం ముందే అనుకున్నాం. అప్పటికప్పుడు అనుకున్నది కాదు. ముందు ప్లాన్ చేశాం. ఈ రోజు షోలో కలుద్దాం” అని రాసుకొచ్చారు.

ఎడ్ షీరన్ కొంతకాలంగా ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, చెన్నైలో కాన్సెర్ట్‌లు నిర్వహించారు. భారీస్థాయిలో జనాలు హాజరయ్యారు. ఫుల్ క్రేజ్ కనిపించింది. చెన్నైలో జరిగిన ఈవెంట్‍కు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ కూడా వచ్చారు. తాజాగా బెంగళూరులో చేసిన పర్ఫార్మెన్స్‌ కూడా ఫుల్ జోష్‍తో సాగింది. అధిక సంఖ్యలో ఆడియన్స్ వచ్చారు. తదుపరి షిల్లాంగ్, ఢిల్లీలో పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు షీరన్.

Whats_app_banner

సంబంధిత కథనం