Allu Arjun Ed Sheeran: అల్లు అర్జున్ బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసిన ఎడ్ షీరన్, అర్మాన్ మాలిక్
Allu Arjun Ed Sheeran: ప్రముఖ సింగర్ ఎడ్ షీరన్ మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బుట్ట బొమ్మ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. బాలీవుడ్ సింగర్, సినిమాలో ఈ పాట పాడిన అర్మాన్ మాలిక్ కూడా ఈ పాటకు స్టెప్పులేశాడు.
Allu Arjun Ed Sheeran: షేప్ ఆఫ్ యూ అనే సాంగ్ తో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన సింగర్ ఎడ్ షీరన్ ప్రస్తుతం ముంబై టూర్లో ఉన్న సంగతి తెలుసు కదా. ఈ సందర్భంగా అతడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీలోని బుట్టబొమ్మ పాటకు స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎడ్ షీరన్ బుట్టబొమ్మ డ్యాన్స్
అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో మూవీ ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. అందులోని బుట్టబొమ్మ సాంగ్ ఇంకా హిట్టయింది. ఇప్పుడా పాటపై ప్రముఖ ఇంగ్లిష్ సింగర్ ఎడ్ షీరన్ డ్యాన్స్ చేయడం విశేషం. ప్రస్తుతం ముంబై టూర్లో ఉన్న అతడు.. బాలీవుడ్ సెలబ్రిటీలతో పార్టీ చేసుకున్నాడు. ఈ సందర్భంగా మూవీలో బుట్టబొమ్మ పాడిన బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ తో కలిసి ఎడ్ షీరన్ స్టెప్పులేశాడు.
ఈ పాటలోని పాపులర్ స్టెప్ వేస్తూ ఈ ఇద్దరు సింగర్లు తెగ ఎంజాయ్ చేశారు. అర్మాన్ ఆ డ్యాన్స్ ఎలా చేయాలో చూపించగా.. అతన్ని చూసి షీరన్ ఆ మూవ్స్ ట్రై చేశాడు. ఈ వీడియోను అర్మాన్ మాలిక్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ హుక్ స్టెప్స్ ను షీరన్ చాలా సులువుగా వేసేయడం విశేషం.
చివరికి తమ డ్యాన్స్ ను షారుక్ ఖాన్ సిగ్నేచర్ పోజుతో ముగించారు. ఫేవరెట్ పర్సన్ ఇన్ మై సిటీ అనే క్యాప్షన్ తో అర్మాన్ మాలిక్ ఈ వీడియోను షేర్ చేశాడు. అల వైకుంఠపురంలో ఆల్బమ్ కు యూట్యూబ్ లో క్రేజ్ మామూలుగా లేదు. ఇందులోని సాంగ్స్ అన్నీ రికార్డులు తిరగరాశాయి. ముఖ్యంగా అర్మాన్ పాడిన ఈ బుట్టబొమ్మ ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది.
ఎవరీ ఎడ్ షీరన్?
ఎడ్ షీరన్ ఇంగ్లిష్ సాంగ్ రైటర్, సింగర్. ఇంగ్లండ్ కు చెందిన 33 ఏళ్ల ఈ పాపులర్ సింగర్ 11 ఏళ్ల వయసులోనే పాటలు రాయడం మొదలుపెట్టాడు. 2011లో అతడు తన తొలి ఆల్బమ్ ప్లస్ రిలీజ్ చేయగా.. అది యూకే ఆల్బమ్స్ చార్ట్ లో టాప్ లో నిలిచింది. అయితే 2017లో ఎడ్ షీరన్ తన మూడో ఆల్బమ్ రిలీజ్ చేశాడు. దీనిపేరు డివైడ్ కాగా.. అందులోని షేప్ ఆఫ్ యు సాంగ్ ప్రపంచాన్ని ఊపేసింది.
ఎడ్ షీరన్ బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఎడ్ షీరన్ ముంబై టూర్లో ఉన్నాడు. మార్చి 16న నగరంలో అతని కాన్సర్ట్ ఉంది. ముంబైలో అతడు పర్యటించడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా అక్కడి బాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతరులు అతనితో కలిసి పార్టీలు చేసుకోవడంతోపాటు సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందులోభాగంగానే అర్మాన్ మాలిక్ కూడా తాను పాడిన బుట్టబొమ్మ పాటపై షీరన్ తో స్టెప్పులేయించాడు.