Tamannaah: బెట్టింగ్ యాప్‌కు సంబంధించి కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో మిల్కీ బ్యూటీని తమన్నాను ఈడీ అధికారులు విచారించారు. అస్సాం గుహవాటిలోని ఈడీ కార్యాలయంలో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా ఈ విచారణ సాగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మహదేవ్ బెట్టింగ్ యాప్ అనుబంధంగా ఉన్నహెచ్‌పీజడ్ టోకెన్ యాప్ ను ఆన్‌లైన్‌లో తమన్నా ప్రమోట్ చేసింది. ఈ యాప్‌కు సంబంధించిన ఓ ఈవెంట్‌కు అటెండ్ అయిన తమన్నా సెలబ్రిటీ హోదాలో భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం.
హెచ్‌పీజడ్ టోకేన్ మనీ యాప్ ద్వారా క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్ పేరుతో పెద్ద ఎత్తున మోసాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ యాప్‌లో 57 ఏడు వేలు పెట్టుబడి పెడితే రోజులు నాలుగు వేలు ఇస్తామని నమ్మబలికి కోట్ల రూపాయల్ని హెచ్‌పీజడ్ ప్రతినిధులు దోచుకున్నట్లు సమాచారం.
ఈ యాప్ ద్వారా వందల కోట్ల రూపాయల్ని బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఆరోపణలకు సంబంధించే తమన్నాను ఈడీ అధికారులు విచారించినట్లు చెబుతోన్నారు.
హెచ్‌పీజడ్ టోకెన్ యాప్ కు సంబంధించి తమన్నాపై ఎలాంటి కేసులు నమోదు కాలేదని అంటున్నారు. యాప్ ప్రమోట్ చేయడంతో పాటు ఈవెంట్‌కు హాజరుకావడానికి ఆమె తీసుకున్న మొత్తాలపై ఈడీ అధికారులు ఆరాలు తీసినట్లు తెలుస్తోంది.
తన తల్లిదండ్రులతో కలిసి గురువారం మధ్యాహ్నం తమన్నా గుహవాటి ఈడీ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు ఆమె ఈడీ ఆఫీస్‌లోనే ఉన్నట్లు చెబుతోన్నారు.
ప్రస్తుతం తమన్నా తెలుగులో ఓదెల 2 మూవీ చేస్తోంది. మైథలాజికల్ టచ్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సంపత్ నంది కథను అందించిన ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాలో శివశక్తి అనే నాగసాధు పాత్రలో తమన్నా కననిపించబోతున్నది.
ఓదెల రైల్వేస్టేషన్‌కు సీక్వెల్‌గా ఓదెల 2 తెరకెక్కుతోంది. ఈ సీక్వెల్‌లో తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓదెల 2 మూవీకి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ దర్శకత్వం వహిస్తోన్నాడు.
తమిళంలో జైలర్, ఆరాణ్మణై 2తో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్నది తమన్నా. జైలర్ మూవీ 600 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా...ఆరాణ్మణై 4 వంద కోట్ల వసూళ్లను దక్కించుకున్నది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ స్త్రీ2లో స్పెషల్ సాంగ్‌లో తమన్నా కనిపించింది.