Eagle Movie Aadu Macha Song Promo: మాస్ బీట్‍తో ఈగల్ నుంచి ‘ఆడు మచ్చా’ సాంగ్.. రవితేజ గెటప్ అదుర్స్: ప్రోమో చూసేయండి-eagle movie first song aadu macha promo released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Eagle Movie Aadu Macha Song Promo: మాస్ బీట్‍తో ఈగల్ నుంచి ‘ఆడు మచ్చా’ సాంగ్.. రవితేజ గెటప్ అదుర్స్: ప్రోమో చూసేయండి

Eagle Movie Aadu Macha Song Promo: మాస్ బీట్‍తో ఈగల్ నుంచి ‘ఆడు మచ్చా’ సాంగ్.. రవితేజ గెటప్ అదుర్స్: ప్రోమో చూసేయండి

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 04, 2023 05:14 PM IST

Eagle First Song - Aadu Macha Promo: ఈగల్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది.మాస్ బీట్‍తో ఈ పాట ఉంది. ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్‍ను కూడా మూవీ యూనిట్ వెల్లడించింది.

Eagle Aadu Macha Promo: మాస్ బీట్‍తో ఈగల్ నుంచి ‘ఆడు మచ్చా’ సాంగ్
Eagle Aadu Macha Promo: మాస్ బీట్‍తో ఈగల్ నుంచి ‘ఆడు మచ్చా’ సాంగ్

Eagle First Song - Aadu Macha Promo: మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్‍ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. టైగర్ నాగేశ్వరరావుతో ఈ ఏడాది మోస్తరు హిట్ సాధించిన ఆయన.. ఈగల్‍తో మరో భారీ బ్లాక్‍బాస్టర్ అందుకుంటారన్న ఆశలు అభిమానుల్లో ఉన్నాయి. టీజర్ తర్వాత ఈ చిత్రంపై ఆసక్తి మరింత అధికమైంది. ఈగల్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈగల్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ అయింది. ఈ పాట ప్రోమో నేడు (డిసెంబర్ 4) వచ్చేసింది.

yearly horoscope entry point

‘ఆడు మచ్చా’ అంటూ ఈగల్ నుంచి ఫస్ట్ సాంగ్ వస్తోంది. ఈ పాట ప్రోమోను మూవీ యూనిట్ నేడు రిలీజ్ చేసింది. ఈ సాంగ్‍ను ఊపున్న మాస్ బీట్‍తో స్వరపరిచారు మ్యూజిక్ డైరెక్టర్ డావ్‍జంద్. రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ పాడారు. ఈ ప్రోమోలో హీరో రవితేజ వేసిన ఓ స్టెప్ ఉంది. డిఫరెంట్ గెటప్‍లో సూపర్ స్టెప్‍తో మాస్ మహారాజ అదరగొట్టారు.

“ఆడు మచ్చా.. ఆడు మచ్చా.. అగడి.. బడగి ఆడు” అంటూ ఈ సాంగ్ ఉంది. ఈగల్ నుంచి తొలి సాంగ్ ‘ఆడు మచ్చా’ పూర్తి లిరికల్ పాట రేపు (డిసెంబర్ 5) సాయంత్రం 6 గంటల 3 నిమిషాల రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రోమో ద్వారానే మూవీ యూనిట్ వెల్లడించింది.

ఈగల్ చిత్రంలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటిస్తున్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ కీలకపాత్రలు చేస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈగల్ సినిమా సంక్రాంతి సందర్భంగా 2024 జనవరి 13న థియేటర్లలో రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ కార్తిక్‍తో పాటు కమిల్ ప్లోకీ, కర్మ్ చావ్లా కూడా సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహిస్తున్నారు.

Whats_app_banner