Eagle First Review: ఈగల్ మూవీకి ఫస్ట్ రివ్యూ ఇచ్చిన రవితేజ - ప్రివ్యూ టాక్ ఎలా ఉందంటే?
Eagle First Review: ఈగల్ రిలీజ్‌కు మూడు రోజుల ముందే రవితేజ సినిమాను చూశాడు. రిజల్ట్, అవుట్‌పుట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఈగల్‌కు రవితేజ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Eagle First Review: రిలీజ్‌కు మూడు రోజుల ముందే తాను హీరోగా నటించిన ఈగల్ మూవీని చూశాడు రవితేజ. సినిమాకు రివ్యూ కూడా ఇచ్చేశాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈగల్ మూవీ ఫిబ్రవరి 9న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. సందేశానికి మాస్, యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ఈగల్ మూవీని తెరకెక్కిస్తోన్నాడు.

రిలీజ్‌కు మూడు రోజుల ముందే రవితేజతో పాటు సినిమా యూనిట్ ఈగల్ మూవీని స్పెషల్‌గా షో వేసుకొని చూశారు. ఈ ప్రివ్యూ చూసిన రవితేజ హ్యాపీగా కనిపించారు. ఈగల్ అవుట్‌పుట్ విషయంలో ఐ యామ్ సూపర్ సాటిస్పైడ్ అంటూ కామెంట్స్ చేశారు. దర్శకుడిని అభినందించారు. రవితేజ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసిన వీడియోను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
ప్రివ్యూ టాక్ అదుర్స్…
ఈగల్ యూనిట్‌తో పాటు మరికొందరు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈగల్ ప్రివ్యూకు అటెండ్ అయినట్లు సమాచారం. వారంతా కూడా సినిమా విషయంలో ఫుల్ పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిసింది. ఈగల్ రవితేజ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడం ఖాయమంటూ సినీ ప్రముఖులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.
స్నైపర్ పాత్రలో రవితేజ యాక్టింగ్, యాక్షన్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేసినట్లు సమాచారం. గత సినిమాలకు మించి ఈగల్‌లో రవితేజ మరింత ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడని, మాస్ మహారాజా ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌లా ఈ మూవీ నిలుస్తుందని ఈగల్ ప్రివ్యూకు టాక్ వచ్చినట్లు చెబుతోన్నారు.
సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది...కానీ...
ఈగల్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని నిర్మాత నిర్ణయించుకున్నారు. కానీ సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ, హనుమాన్ సినిమాలు నిలవడంతో థియేటర్ల సమస్య ఏర్పడింది. ఒకేసారి ఐదు స్ట్రెయిట్ సినిమాలు రిలీజైతే అన్ని సినిమాలు నష్టపోయే ప్రమాదం ఉండటంతో ఫిలింఛాంబర్, ప్రొడ్యూసర్ గిల్డ్ కలిసి సంక్రాంతి నిర్మాతలతో చర్చలు జరిపి ఈగల్‌ను ఫిబ్రవరి 9కి వాయిదావేశారు.
తొమ్మిదేళ్ల తర్వాత...
రైతు సమస్యలకు రివేంజ్ డ్రామాను జోడించి ఈగల్ మూవీని దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తోన్నట్లు సమాచారం. దర్శకుడిగా కార్తిక్ ఘట్టమనేనికి ఇది రెండో మూవీ. సినిమాటోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కార్తిక్ ఘట్టమనేని 2015లో నిఖిల్ హీరోగా నటించిన సూర్య వర్సెస్ సూర్య మూవీతో డైరెక్టర్‌గా మారాడు. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ఈగల్‌తో మళ్లీ మెగాఫోన్ పట్టాడు.
ఈగల్‌లో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈగల్ మూవీని నిర్మిస్తున్నాడు. ధమాకా తర్వాత ఈ బ్యానర్‌లో రవితేజ చేస్తోన్న మూవీ ఇది. ధమాకా వంద కోట్ల క్లబ్‌లో చేరిన రవితేజ ఫస్ట్ మూవీగా నిలిచింది. గత ఏడాది రవితేజ సోలో హీరోగా నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్స్ అయ్యాయి. చిరంజీవితో కలిసి నటించిన వాల్తేర్ వీరయ్య ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
టాపిక్