Dunki Trailer: షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్‌ రిలీజ్‍కు డేట్ ఖరారు!: వివరాలివే-dunki trailer set to release on december 5 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dunki Trailer Set To Release On December 5

Dunki Trailer: షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్‌ రిలీజ్‍కు డేట్ ఖరారు!: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 04, 2023 05:59 PM IST

Dunki Trailer: డంకీ ట్రైలర్ రిలీజ్ డేట్‍పై సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

Dunki Trailer: షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్‌ రిలీజ్‍కు డేట్ ఖరారు!: వివరాలివే
Dunki Trailer: షారుఖ్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్‌ రిలీజ్‍కు డేట్ ఖరారు!: వివరాలివే

Dunki Trailer: బాలీవుడ్ బాద్‍షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ ఏడాది రెండు బంపర్ బ్లాక్‍బాస్టర్లు కొట్టారు. ఆయన నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు ఈ ఏడాది రూ.1,000కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సూపర్ హిట్‍గా నిలిచాయి. షారుఖ్ హీరో నటించిన ‘డంకీ’ చిత్రం డిసెంబర్ 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. 3ఇడియట్స్, పీకే లాంటి చిత్రాలను తెరకెక్కించిన రాజ్‍కుమార్ హిరానీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, డంకీ సినిమా ట్రైలర్ రిలీజ్‍ గురించి సమాచారం బయటికి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

డంకీ సినిమా ట్రైలర్ రేపు (డిసెంబర్ 5) రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. డంకీ ట్రైలర్ డిసెంబర్ 5న రానుందని సమాచారం చక్కర్లు కొడుతోంది.

టీజర్, సాంగ్ అని కాకుండా డంకీ నుంచి ఇప్పటి వరకు డ్రాప్ అనే పేరుతో తీసుకొస్తోంది మూవీ యూనిట్. డంకీ ట్రైలర్ కూడా ‘డంకీ డ్రాప్ 4’గా వస్తుందని అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యేందుకు ఇంకా 16 రోజులే ఉన్న తరుణంలో ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ రెడీ అయింది. డంకీ కథ గురించిన ముఖ్యమైన పాయింట్స్ ఈ ట్రైలర్‌లో ఉంటాయని అంచనా.

విదేశాలకు వీసా లేకుండా వెళ్లాలని అనుకునే స్నేహితుల కథే డంకీ అని తెలుస్తోంది. తమ కలను సాకారం చేసుకునే క్రమంలో వారి జీవితం ఎలా మారిందన్నదే ప్రధాన కథగా ఉంటుంది. కామెడీ, లవ్, ఫ్రెండ్‍షిప్, ఎమోషన్‍తో డైరెక్టర్ రాజ్‍కుమార్ హిరానీ మార్కుతో ఈ చిత్రం ఉండనుందని టీజర్ చూస్తేనే అర్థమైంది. ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి యాక్షన్ చిత్రాలు షారుఖ్ నుంచి రాగా.. డంకీ మాత్రం వాటికి విభిన్నంగా ఉండనుంది.

డంకీ చిత్రంలో షారుఖ్, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, బొమ్మన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్ కీలకపాత్రల్లో నటించారు. ప్రితమ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‍మెంట్స్, రాజ్‍కుమార్ హిరానీ, ఫిల్మ్స్, జియో స్టూడియోస్ బ్యానర్లు ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి.

డంకీ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కానుండగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ ఆ తర్వాతి రోజే డిసెంబర్ 22నే విడుదలవుతుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రెండు భారీ చిత్రాలు, సూపర్ స్టార్లు పోటీపడనున్నారు. దీంతో ఈ వార్‌పై ఆసక్తి విపరీతంగా ఉంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.