దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తెలుగులో వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న హీరో. అలాంటి నటుడు మలయాళంలో కొన్ని అదిరిపోయే థ్రిల్లర్ సినిమాల్లో నటించాడు. అవేంటి? ఏ ఓటీటీలో చూడాలన్న వివరాలు తెలుసుకోండి.
దుల్కర్ సల్మాన్ 2022లో నటించిన మూవీ సెల్యూట్. ఈ సినిమా తెలుగులోనూ సోనీ లివ్, యూట్యూబ్ లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ హత్య కేసులో ఓ అమాయకుడిని ఇరికించామన్న పశ్చాత్తాపంతో అసలు హంతకుడి కోసం వెతికే ఎస్ఐ అరవింద్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు ఐఎండీబీలో 7 రేటింగ్ ఉంది.
చుప్ కూడా 2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తప్పుడు రివ్యూలు ఇచ్చే నకిలీ ఫిల్మ్ క్రిటిక్స్ ను లక్ష్యంగా చేసుకొని చంపే సీరియల్ కిల్లర్, అతన్ని పట్టుకోవడానికి వచ్చే పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.5 రేటింగ్ ఉంది. జీ5 ఓటీటీలో మూవీని చూడొచ్చు.
కురుప్ ఓ బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సుకుమార కురప్ అనే క్రిమినల్ నిజ జీవిత స్టోరీ ఇది. 40 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న క్రిమినల్ అతడు. ఆ కురుప్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అమాయకుడిని హత్య చేసి, దానిని కప్పి పుచ్చుకోవడానికి మరెన్నో తప్పులు చేసే వ్యక్తి స్టోరీ ఇది. నెట్‌ఫ్లిక్స్ తోపాటు యూట్యూబ్ లోనూ ఫ్రీగా చూడొచ్చు.
తీవ్రమ్ 2012లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాను ఎంఎక్స్ ప్లేయర్ లో చూడొచ్చు. హర్షవర్దన్ అనే ఓ వ్యక్తి ఓ ఆటోడ్రైవర్ ను కిడ్నాప్ చేసి ముక్కలుగా నరికేస్తాడు. ఎలాంటి సాక్ష్యాధారాలు దొరక్కుండా చేస్తాడు. పోలీసులకు అతనిపై అనుమానం ఉన్నా.. హత్య అతడే చేశాడని నిరూపించలేని పరిస్థితి. ఈ సినిమాను ఎంఎక్స్ ప్లేయర్ లో చూడొచ్చు.
దుల్కర్ సల్మాన్ నటించిన మరో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. 2023లో రిలీజైంది. నేరాలతో అట్టుడుకే ఓ టౌన్ లో కన్నన్ భాయ్, అతని గ్యాంగ్ రాజ్యమేలుతుంది. వీరికి చెక్ పెట్టడానికి సీఐ షాహుల్.. అక్కడి కింగ్ ను మరోసారి వ్యూహాత్మకంగా రప్పిస్తాడు. ఆ తర్వాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఈ సినిమాను జియోహాట్‌స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
సంబంధిత కథనం