Dulquer Salmaan: తెలుగులో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైన దుల్కర్ సల్మాన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సెకండ్ సో మూవీ తెలుగులో డైరెక్ట్‌గా యూట్యూబ్ రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీతోనే మలయాళంలోకి హీరోగా దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇచ్చాడు.

Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సెకండ్ షో మూవీ తెలుగులో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు.
దుల్కర్ సల్మాన్ డెబ్యూ...
సెకండ్ షో మూవీ మలయాళంలో 2012లో రిలీజైంది. ఈ మూవీతోనే మలయాళంలోకి హీరోగా దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇచ్చాడు. దుల్కర్ సల్మాన్ మాత్రమే కాకుండా సెకండ్ షో మూవీ ద్వారా సన్నీ వేన్, గౌతమి నాయర్‌తో పలువురు నటీనటులు మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్‌కు కూడా ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం.
క్రైమ్ థ్రిల్లర్ మూవీ...
సెకండ్ షో మూవీతో హీరోగా తొలి ప్రయత్నంలోనే మలయాళ ప్రేక్షకులను మెప్పించాడు దుల్కర్ సల్మాన్. కమర్షియల్ సక్సెస్‌గా ఈ మూవీ నిలిచింది. ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇతర చీకటి వ్యాపారాల నేపథ్యంలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు.
హీరోగా మొదటి సినిమాలోనే నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించి దుల్కర్ సల్మాన్ వైవిధ్యతను చాటుకున్నాడు. మలయాళంలో రిలీజైన పదేళ్ల తర్వాత సెకండ్ షో తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే రిలీజైంది. ఒక్క రోజులోనే ఈ మూవీ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.
పాన్ ఇండియన్ హీరో...
దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మలయాళంలో టాప్ స్టార్‌గా కొనసాగుతోన్న అతడు తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే రిలీజైన ప్రభాస్ కల్కిలో దుల్కర్ సల్మాన్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ప్రభాస్ యుద్ధ విద్యలు నేర్పిన ఓ గురువు పాత్రలో తళుక్కున మెరిశాడు. అతడి క్యారెక్టర్‌కు ప్రశంసలు దక్కుతున్నాయి. వారం రోజుల్లోనే థియేటర్లలో ఈ మూవీ 700 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
లక్కీ భాస్కర్...
తెలుగులో హీరోగా సీతారామం మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు దుల్కర్ సల్మాన్. ఈ లవ్‌స్టోరీ తర్వాత లక్కీ భాస్కర్ సినిమాకు దుల్కర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. వెంకీ అట్లూరి దర్వకత్వం వహిస్తోన్న ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ లక్కీ భాస్కర్ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. తమిళంలో సూర్య హీరోగా నటిస్తోన్న సినిమాలో దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. బాలీవుడ్‌లో కార్వాన్, చుప్ సినిమాలు చేశాడు దుల్కర్. ప్రజెంట్ హిందీ, మలయాళంలో మరో మూడు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్ సల్మాన్.