Dulquer Salmaan: వాయిదా పడిన దుల్కర్ సల్మాన్ సినిమా.. విజయ్ ది గోట్ మూవీనే కారణం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!-dulquer salmaan lucky bhaskar postponed to diwali due to clash with vijay goat movie lucky bhaskar new release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dulquer Salmaan: వాయిదా పడిన దుల్కర్ సల్మాన్ సినిమా.. విజయ్ ది గోట్ మూవీనే కారణం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Dulquer Salmaan: వాయిదా పడిన దుల్కర్ సల్మాన్ సినిమా.. విజయ్ ది గోట్ మూవీనే కారణం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Sanjiv Kumar HT Telugu
Aug 21, 2024 11:10 AM IST

Dulquer Salmaan Lucky Bhaskar Postponed To Diwali: సీతారామంమ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన కొత్త మూవీ లక్కీ భాస్కర్. సెప్టెంబర్ 7న విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు మేకర్స్. అందుకు కారణం ఇళయ దళపతి విజయ్ నటించిన ది గోట్ మూవీనే కారణంగా తెలుస్తోంది.

వాయిదా పడిన దుల్కర్ సల్మాన్ సినిమా.. విజయ్ ది గోట్ మూవీనే కారణం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
వాయిదా పడిన దుల్కర్ సల్మాన్ సినిమా.. విజయ్ ది గోట్ మూవీనే కారణం.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Dulquer Salmaan Lucky Bhaskar New Release Date: వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ "మహానటి", "సీతారామం" వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

ప్రతిష్టాత్మకంగా

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దుల్కర్ సల్మాన్ అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రేమికులు సైతం "లక్కీ భాస్కర్" విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

లక్కీ భాస్కర్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన "శ్రీమతి గారు" గీతం, టైటిల్ ట్రాక్‌తో పాటు, టీజర్‌ విశేషంగా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులలో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ చిత్రాన్ని మొదట సెప్టెంబర్ 7వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ, తాజాగా లక్కీ భాస్కర్ మూవీ విడుదలను వాయిదా వేశారు.

దీపావళి సందర్భంగా

ఇప్పుడు దీపావళి పండుగ కానుకగా లక్కీ భాస్కర్ మూవీని విడుదల చేయాలని నిర్ణయించారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 31న తెలుగు, మలయాళం, తమిళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. అయితే, లక్కీ భాస్కర్ సినిమాను వాయిదా వేయడానికి కారణం ఇళయ దళపతి విజయ్ నటించిన క్రేజీ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (ది గోట్ మూవీ) కారణమని సమాచారం.

విజయ్ నటించిన ది గోట్ మూవీ సెప్టెంబర్ 5నే థియేటర్లలోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఇష్టం లేకే లక్కీ భాస్కర్ మేకర్స్ తమ చిత్రాన్ని దీపావళికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద విజయ్ మూవీతో క్లాష్ అయితే కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రావని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది.

ఆదరణ తక్కువ

ఇక తమిళంలో అయితే విజయ్ సినిమా ఉండగా మిగతా చిత్రాలకు ఆదరణ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, మరోవైపు "లక్కీ భాస్కర్" కోసం ఇంతలా ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూనే.. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేయడానికి అదనపు సమయం పడుతుందని, అందుకే విడుదల తేదీ మారిందని నిర్మాణ సంస్థ వివరించింది.

వెండితెరపై ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించడం కోసం, డబ్బింగ్ సహ అన్ని సాంకేతిక విభాగాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పని చేస్తున్నట్లు తెలిపింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని, ప్రతి భాషలో మాతృ భాష అనుభూతిని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి

చిత్ర విడుదలను వాయిదా వేయడం కష్టమైనప్పటికీ, ఈ నిర్ణయం సినిమాకు మేలు చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. "లక్కీ భాస్కర్" చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు బంగ్లాన్ ఈ చిత్రం కోసం 80ల నాటి ముంబైని పునర్నిర్మించారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.