King of Kotha: ‘హల్లా మచారే’: దుల్కర్ మూవీ నుంచి మాస్ మసాలా సాంగ్ రిలీజ్
King of Kotha: దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కింగ్ ఆఫ్ కోటా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో ఇది స్పెషల్ సాంగ్‍గా ఉంది.
King of Kotha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం పవర్‌ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ ‘కింగ్ ఆఫ్ కోటా’ చేస్తున్నాడు. ఈ చిత్రంలో గ్యాంగ్‍స్టర్‌గా దుల్కర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్‌లతో కింగ్ ఆఫ్ కోటా చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. పాన్ ఇండియా రేంజ్‍లో నాలుగు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా, నేడు (జూలై 28) దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ‘కింగ్ ఆఫ్ కోటా’ చిత్రం నుంచి తొలి పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫుల్ మాస్ బీట్‍తో ఈ సాంగ్ ఉంది. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
“అసురుడే రావణ.. అదిరే అనురా” అంటూ కింగ్ ఆఫ్ కోటాలోని ఈ తొలి సాంగ్ తెలుగులో ప్రారంభమైంది. మొత్తంగా ఇది ఓ మాస్ పార్టీ సాంగ్‍గా ఉంది. దుల్కర్ రఫ్, రగెడ్ లుక్‍లో అదరగొట్టాడు. హల్లా మచారే అంటూ ఫాస్ట్ బీట్‍లో సాగింది ఈ సాంగ్. కింగ్ ఆఫ్ కోటా నుంచి ఈ ఫస్ట్ సింగిల్ మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందించాడు.
‘హల్లా మచారే’ తెలుగు పాటను రేవంత్, సింధుజ శ్రీనివాసన్ ఆలపించారు. కృష్ణ కాంత్ రిలిక్స్ అందించాడు. రితికా సింగ్ ఈ స్పెషల్ సాంగ్‍లో చిందేసింది.
కింగ్ ఆఫ్ కోటా చిత్రానికి అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నాడు. 1980-90ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ సినిమా ఉండనుంది. దుల్కర్ సల్మాన్ తొలిసారి గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మలయాళంలో రూపొందుతున్న కింగ్ ఆఫ్ కోటా సినిమా తెలుగు, హిందీ, తమిళంలోనూ విడుదల కానుంది.
కింగ్ ఆఫ్ కోటా మూవీలో దుల్కర్ సరసన హీరోయిన్‍గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. డ్యాన్సింగ్ రోజ్ షబీర్, ప్రసన్న, ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ కీలక పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ వేఫార్ కింద జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండనుంది. ఈ చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తోంది. అయితే, రిలికల్ సాంగ్‍లో సినిమా రిలీజ్ డేట్‍ను ప్రస్తావించలేదు.