దృశ్యం దర్శకుడి ఈ 5 థ్రిల్లర్ సినిమాలను ఓటీటీల్లో తప్పక చూడాల్సిందే! ఏ ప్లాట్‍ఫామ్‍ల్లో ఉన్నాయంటే..-drishyam director jeethu joseph top 5 crime thriller movies you must watch on otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  దృశ్యం దర్శకుడి ఈ 5 థ్రిల్లర్ సినిమాలను ఓటీటీల్లో తప్పక చూడాల్సిందే! ఏ ప్లాట్‍ఫామ్‍ల్లో ఉన్నాయంటే..

దృశ్యం దర్శకుడి ఈ 5 థ్రిల్లర్ సినిమాలను ఓటీటీల్లో తప్పక చూడాల్సిందే! ఏ ప్లాట్‍ఫామ్‍ల్లో ఉన్నాయంటే..

దృశ్యం సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు జితూ జోసెఫ్.. మరిన్ని చిత్రాలను కూడా ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. ఇవి కూడా థ్రిల్లర్స్ ఇష్టపడే వారిని ఆకట్టుకుంటాయి. వాటిలో 5 టాప్ చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

దృశ్యం దర్శకుడి ఈ 5 థ్రిల్లర్ చిత్రాలను తప్పక చూడాల్సిందే!

దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలతో నేషనల్ వైడ్‍గా పాపులర్ అయ్యారు డైరెక్టర్ జితూ జోసెఫ్. మోహన్‍లాల్ హీరోగా నటించిన ఆ రెండు మలయాళ చిత్రాలు ఉత్కంఠతో ప్రేక్షకులను ఊపేశాయి. దృశ్యం చిత్రాలతో జితూ జోసెఫ్ మ్యాజిక్ చేశారు. ప్రేక్షకులను కట్టిపడేశారు. అయితే, దృశ్యం చిత్రాలే కాకుండా మరిన్ని థ్రిల్లర్లను ఆకట్టుకునేలా తెరెక్కించారు జోసెఫ్. వాటిలో ఐదు సినిమాలు గురించి ఇక్కడ చూడండి. థ్రిల్లర్స్ ఇష్టపడే వారు ఓటీటీల్లో వీటిని మిస్ అవొద్దు.

డిటెక్టివ్

మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం డిటెక్టివ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీని గ్రిప్పింగ్‍గా.. ఆకట్టుకునే నరేషన్‍తో దర్శకుడు జితూ జోసెఫ్ తెరకెక్కించారు. 2007లో రిలైజన ఈ చిత్రంలో సురేశ్ గోపీ ప్రధాన పాత్ర పోషించారు. ఓ అమ్మాయి మర్డర్ మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. డిటెక్టివ్ చిత్రాన్ని ఇప్పుడు జియోహాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.

మెమొరీస్

పృథ్విరాజ్ సుకుమార్ లీడ్ రోల్ చేసిన మెమొరీస్ సినిమా 2013లో విడుదలైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని జితూ జోసెఫ్ తెరకెక్కించారు. వరుస హత్యలను పోలీస్ ఆఫీసర సామ్ అలెక్స్ (పృథ్విరాజ్) దర్యాప్తు చేయడం చుట్టూ ఈ మూవీ ఉంటుంది. ట్విస్టులు, మలుపులతో ఆసక్తికరంగా ఈ చిత్రం సాగుతుంది. మెమొరీస్ సినిమా జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

కూమన్

జితూ జోసెఫ్ దర్శకత్వం వహించిన కూమన్ సినిమా 2022లో రిలీజై ప్రేక్షకులను మెప్పించింది. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ లీడ్ రోల్ చేశారు. కేసుల్లో క్లూలను చాకచక్యంగా కనిపెట్టే ఓ కానిస్టేబుల్ చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కూమన్ చిత్రాన్ని చూడొచ్చు.

ట్వెల్త్ మ్యాన్

మోహన్‍లాల్ హీరోగా నటించిన ట్వెల్త్ మ్యాన్ (12th Man) సినిమా 2022లో డిస్నీ+ హాట్‍స్టార్ (ఇప్పుడు జియోహాట్‍స్టార్) ఓటీటీలోకి వచ్చింది. జితూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ సస్సెన్స్‌తో సాగుతుంది. స్నేహితుల మధ్య ఊహించని విధంగా రహస్యాలు బయటపడటం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది.

నునక్కుళి

బాసిల్ జోసెఫ్ ప్రధాన పాత్ర పోషించిన నునక్కుళి చిత్రం మంచి హిట్ సాధించింది. ఈ మలయాళ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ చిత్రాన్ని డైరెక్టర్ జితూ జోసెఫ్ తెరకెక్కించారు. ఓ ఐటీ రైడ్‍తో వ్యాపారవేత్త జీవితంలో జరిగిన పరిణామాల చుట్టూ ఈ మూవీ ఉంటుంది. నునక్కుళి సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులో ఉంది.

జితూ జోసెఫ్ మోస్ట్ సక్సెస్ సినిమాలు దృశ్యం 1.. జియోహాట్‍స్టార్ ఓటీటీలో, దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు ఉన్నాయి. వెంకటేశ్ చేసిన తెలుగు రీమేక్ దృశ్యం 1,2 సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం