OTT Releases This Week:,విశాల్ లాఠీ - సన్ నెక్స్ట్విశాల్ లాఠీ సినిమా థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం (నేడు)నుంచి సన్ నెక్స్ట్‌లో ఈసినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నిజాయితీపరుడైన కానిస్టేబుల్‌గా విశాల్ కనిపించాడు. ఓ గ్యాంగ్‌స్టర్ నుంచి తన కుటుంబాన్ని ఓ కానిస్టేబుల్ ఎలా కాపాడుకున్నాడనే పాయింట్‌తో యాక్షన్, ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో సునైన హీరోయిన్‌గా నటించింది.,హెడ్ బుష్ - జీ5పుష్ప ఫేమ్ డాలీ ధనుంజయ హీరోగా నటించిన కన్నడ చిత్రం హెడ్‌బుష్ జీ5 ఓటీటీలో జనవరి 13న రిలీజైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాతో కన్నడంలోకి పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అడుగుపెట్టింది. బెంగళూరు ఫస్ట్ అండర్ వరల్డ్ డాన్ జయరాజ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు శూన్య దర్శకత్వం వహించాడు.,దృశ్యం -2 (హిందీ) -అమెజాన్ ప్రైమ్అజయ్ దేవ్‌గణ్, శ్రియ జంటగా నటించిన దృశ్యం - 2 సినిమా గత ఏడాది బాలీవుడ్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన దృశ్యం - 2 ఇటీవలే ఆమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో రిలీజైంది. తాజాగా గురువారం నుంచి సబ్‌స్రైబర్స్ అందరికీ ఫ్రీగా ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు 350 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించాడు.,హంటర్స్ వెబ్‌సిరీస్ - జనవరి - 13 అమెజాన్ ప్రైమ్,క్రాష్ కోర్స్ ఇన్ రొమాన్స్ - జనవరి 13- నెట్‌ఫ్లిక్స్,కుంగ్ ఫూ పాండ ది డ్రాగన్ నైట్ సీజన్ -2 - జనవరి 12 - నెట్‌ఫ్లిక్స్,ఉన్ని ముకుందన్ అసోసియేట్స్ - జనవరి 13 - డిస్నీ ప్లస్ హాట్‌స్టార్,బ్రేక్ పాయింట్ - జనవరి 13 - నెట్‌ఫ్లిక్స్,ట్రయల్ బై ఫైర్ - జనవరి 13 - నెట్‌ఫ్లిక్స్,స్కై రోజో - జనవరి 13 - నెట్‌ఫ్లిక్స్,వరలులు ముఖ్యం (తమిళం ) జనవరి 15 - నెట్‌ఫ్లిక్స్