Drinker Sai Review: డ్రింకర్ సాయి రివ్యూ.. పచ్చి తాగుబోతును ప్రేమిస్తే.. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ ఎలా ఉందంటే?
Drinker Sai Movie Review And Rating In Telugu: టీజర్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన తెలుగు న్యూ మూవీ డ్రింకర్ సాయి. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమాకు కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. బోల్డ్ డైలాగ్స్, రా సీన్స్‌తో సాగే ఈ మూవీ ఎలా ఉందో డ్రింకర్ సాయి రివ్యూలో తెలుసుకుందాం.
Drinker Sai Movie Review Telugu: సింధూరం సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమైన ధర్మ నటించిన రెండో సినిమా డ్రింకర్ సాయి. ఐశ్వర్య శర్మ హీరోయిన్‌గా పరిచయం అయిన డ్రింకర్ సాయి మూవీకి కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్‌తోనే ఒక రేంజ్‌లో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రభాస్ విశెష్ అందించారు. యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఇవాళ (డిసెంబర్ 27) రిలీజైంది. మరి ఈ మూవీ ఎలా ఉందో డ్రింకర్ సాయి రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: డ్రింకర్ సాయి
నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, కిర్రాక్ సీత, రీతూ చౌదరి, అంబర్‌పేట్ శంకర్, తదితరులు
కథ, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి
నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
సంగీతం: శ్రీ వసంత్
సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
విడుదల తేది: డిసెంబర్ 27, 2024
కథ:
ధనవంతుల కుటుంబంలో పుట్టిన సాయి (ధర్మ) మద్యానికి బానిస అవుతాడు. ఫ్రెండ్స్‌తో జూలాయిగా తిరగడం, గొడవలు పెట్టుకోవడం, పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం, రావడం ఇలాగే సాగుతుంది. అలానే డ్రింకర్ సాయిగా పేరు తెచ్చుకుంటాడు. ఓ రోజు సాయిని భాగీ (ఐశ్వర్య శర్మ) తన స్కూటీతో యాక్సిడెంట్ చేసి పారిపోతుంది. తనకు యాక్సిడెంట్ చేసిందో ఎవరో తెలుసుకున్న ధర్మ భాగీతో లవ్‌లో పడతాడు.
తనను ప్రేమించని భాగీ వెంటపడతాడు ధర్మ. అయితే, తనను ఏం చేస్తాడో, ఎలా వయలెంట్‌గా రియాక్ట్ అవుతాడో అని భయపడిన భాగీ ఇష్టం లేకపోయిన ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతుంది. ఇలా సాగుతుండగా భాగీ ప్రేమపై సాయికి అనుమానం కలిగుతుంది. తన బర్త్ డే రోజున ధర్మ చేసిన పనికి ప్రేమించట్లేదని నిజం చెబుతుంది భాగీ.
ట్విస్టులు
దాంతో మరింతగా తాగుడు బానిస అయిన సాయి భాగీని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సాయి నుంచి భాగీ ఎలా తప్పించుకుంది? అసలు సాయి తాగడానికి గల కారణాలు ఏంటీ? భాగీ ప్రేమపై సాయికి ఎందుకు అనుమానం కలిగింది? వంతెన (భద్రం) పాత్ర ఏంటీ? చివరికి సాయిని భాగీ అర్థం చేసుకుందా? ఇద్దరు ఒక్కటయ్యారా? అనే విషయాల సమ్మేళనమే డ్రింకర్ సాయి.
విశ్లేషణ:
యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు అంటే తెలుగులో అనేక సినిమాలు తెరపైకి వచ్చాయి. కాన్సెప్ట్ కాస్తా అటు ఇటుగా ఉన్న లవ్, రొమాన్స్, బ్రేకప్, మళ్లీ ప్యాచప్ లేదా సాడ్ ఎండింగ్ విషయాలు కామన్‌గా ఉంటాయి. అయితే, వీటిని ఎలాంటి సన్నివేశాలతో తెరకెక్కించామనేదే చూసే ప్రేక్షకులకు ఫ్రెష్‌నెస్‌ను ఇచ్చేది.
అయితే, డ్రింకర్ సాయికి తీసుకున్న సబ్జెక్ట్ రొటీన్‌దే. కానీ, అక్కడక్కడ ఎంగేజ్ చేస్తూ, ఫన్‌తో ముందుకు సాగుతుంది. క్లైమాక్స్‌లో డ్రింకింగ్ వల్ల వచ్చే నష్టాలు చెబుతూ ఒక మెసేజ్ ఇచ్చారు. అయితే, ఈ సినిమాలో తనను ప్రేమిస్తున్నావాడు పెద్ద తాగుబోతు అని ముందే హీరోయిన్‌కు తెలుసు. కాబట్టి, రెండు పాటలు, మూడు కామెడీ సీన్స్ వంటి రెగ్యులర్ సీన్స్ కాకుండా ఇంకాస్తా డిఫరెంట్‌గా సన్నివేశాలు పడి ఉంటే మరింత ఎంగేజింగ్‌గా మూవీ ఉండేది.
మద్యం వల్ల వచ్చే నష్టాలు
సాయికి వచ్చే ఇన్‌కమ్ ఏంటీ, తను అలా ఎందుకు అయ్యాడు అనే విషయాలు బాగానే చూపించారు. ఫాస్ట్ ఫార్వాడ్‌లా కాకుండా ఇంకాస్తా డెప్త్‌గా చూపిస్తే మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేవారు. వంతెన పాత్రతో వచ్చే కామెడీ ట్రాక్ బాగుంది. క్లైమాక్స్‌ను ఇంకాస్తా కన్విన్స్‌గా చూపిస్తే మద్యం వల్ల వచ్చే నష్టాలు ఇంకా యూత్‌కు తెలిసే అవకాశం ఉండేది.
సినిమా నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. సంగీతం బాగుంది. డైలాగ్స్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. ఇక డ్రింకర్ సాయిగా ధర్మ నటన చాలా బాగుంది. సినిమాకు మెయిన్ హైలెట్ ధర్మ నటన అని చెప్పొచ్చు. ధర్మ యాక్టింగ్‌లో మంచి ఈజ్ ఉంది. ఎమోషనల్ ట్రాక్‌లో బాగా చేశాడు. అలాగే, కొత్త హీరోయిన్ ఐశ్వర్య శర్మ గ్లామర్‌గా అందంగా కనిపించింది. భాగీ రోల్‌కు బాగా సూట్ అయింది.
ఫైనల్‌గా చెప్పాలంటే..
ఇదివరకు రెండు సినిమా ఛాన్స్‌లు వచ్చిన చేయని అంబర్ పేట శంకర్ ఈ మూవీతో డెబ్యూ ఎంట్రీ ఇచ్చారు. ఆయనతోపాటు భద్రం, శ్రీకాంత్ అయ్యంగార్ మిగతా పాత్రలు చేసిన వారంతా సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే డ్రింకర్ సాయి మంచి సందేశం ఇచ్చే రొటీన్ లవ్ స్టోరీ.