Small Movies: ఇండస్ట్రీలో మనమంతా బతికేది చిన్న సినిమాల వల్లే.. డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి కామెంట్స్
Drinker Sai Movie Director Kiran Tirumalasetty: చిన్న సినిమాల వల్లే ఇండస్ట్రీలో మనమంతా బతికేది అని చెప్పుకొచ్చారు డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన తెలుగు మూవీ డ్రింకర్ సాయికి కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు.
Director Kiran Tirumalasetty About Small Movies: తెలుగులో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిన్న బడ్జెట్ సినిమా డ్రింకర్ సాయి. ఈ మూవీతో ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్స్‌గా పరిచయం అవుతున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీకి కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వం వహించారు.
డ్రింకర్ సాయి ప్రీ రిలీజ్ ఈవెంట్
డ్రింకర్ సాయి మూవీని డిసెంబర్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా డిసెంబర్ 25న డ్రింకర్ సాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టితోపాటు ఇతర టెక్నీషియన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కష్టానికి ఫలితం
డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ.. "ఈ రోజు డ్రింకర్ సాయి సినిమాను డైరెక్ట్ చేసి ఈ వేదిక మీద మాట్లాడుతున్నానంటే మా పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్సే కారణం. ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీలో పడిన కష్టానికి ఫలితంగా ఒక మంచి సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఇండస్ట్రీలో మనమంతా బతికేది చిన్న చిత్రాల వల్లే. అవి బాగుంటేనే మనమంతా బాగుంటాం" అని అన్నారు.
నచ్చకుంటే జీరో రేటింగ్ ఇవ్వండి
"రివ్యూ రైటర్స్‌ను నేను బాగా గౌరవిస్తాను. మీకు మా డ్రింకర్ సాయి సినిమా నచ్చకుంటే జీరో రేటింగ్ ఇవ్వండి. కాస్త మీ మనసును కదిలించినా 3 రేటింగ్ ఇవ్వండి. మా సినిమాకు మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డ్స్ తప్పకుండా ధర్మకు వస్తాయి. అంత బాగా తను పర్‌ఫార్మ్ చేశాడు" అని డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.
వందమందికి చెప్పండి
"ప్రేక్షకులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సినిమా నచ్చితే పదిమందికి చెప్పండి, నచ్చకుంటే వందమందికి చెప్పండి. ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చేసిన సినిమా కాదు. మేము ఒక కథను నమ్మి జెన్యూన్‌గా తెరకెక్కించాం. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫన్ ఉంటుంది. వంతెన అనే క్యారెక్టర్‌ను పెట్టాం. ఆ క్యారెక్టర్ ఫుల్ ఎంటర్‌టైనింగ్ చేస్తూ సాగుతుంది. క్లైమాక్స్‌కు వచ్చేసరికి 40 నిమిషాలు అలా చూస్తుండిపోతారు. అంత డెప్త్ ఉంటుంది క్లైమాక్స్‌లో" అని కిరణ్ తిరుమలశెట్టి పేర్కొన్నారు.
ఆయనే ఎక్కువగా నమ్మారు
హీరోయిన్ ఐశ్వర్య శర్మ మాట్లాడుతూ.. "డ్రింకర్ సాయి సినిమాలో నేను బాగీ క్యారెక్టర్ చేయగలను అని నాకంటే ఎక్కువగా నమ్మారు డైరెక్టర్ కిరణ్ గారు. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. అలాగే ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌కు థ్యాంక్స్" అని చెప్పింది.
తనే మొదటి సినిమా హీరో
"ధర్మ నా కెరీర్‌లో చేసిన మొదటి చిత్రానికి హీరో. అతనితో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అలాగే మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ సపోర్ట్ అందించారు. డ్రింకర్ సాయి సినిమా ఈ నెల 27న మీ ముందుకు వస్తోంది. సినిమాలోని ఎమోషన్, ఫన్‌ను మీరంతా ఫీల్ అవుతారు" అని డ్రింకర్ సాయి హీరోయిన్ ఐశ్వర్య శర్మ తెలిపింది.