Drinker Sai Collection: తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ.. డ్రింకర్ సాయి కలెక్షన్స్ ఇవే!-drinker sai box office collection in andhra pradesh and telangana starrer by dharma aishwarya sharma ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Drinker Sai Collection: తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ.. డ్రింకర్ సాయి కలెక్షన్స్ ఇవే!

Drinker Sai Collection: తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ.. డ్రింకర్ సాయి కలెక్షన్స్ ఇవే!

Sanjiv Kumar HT Telugu
Jan 03, 2025 10:37 AM IST

Drinker Sai Box Office Collection In AP Telangana: తెలుగులో రీసెంట్‌గా వచ్చిన డ్రింకర్ సాయి సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల డ్రింకర్ సాయికి వచ్చిన 5 రోజుల కలెక్షన్స్ వివరాలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో డ్రింకర్ సాయి బాక్సాఫీస్ కలెక్షన్స్ పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ.. డ్రింకర్ సాయి కలెక్షన్స్ ఇవే!
తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ.. డ్రింకర్ సాయి కలెక్షన్స్ ఇవే!

Drinker Sai Box Office Collection: ఇయర్ ఎండ్‌లో చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయాన్ని సాధించింది "డ్రింకర్ సాయి" మూవీ. ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ప్రేక్షకుల ఆదరణ చూసి స్మాల్ ఫిల్మ్ బిగ్ హిట్ అంటూ అటు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయని మేకర్స్ అంటున్నారు.

yearly horoscope entry point

ఏపీలో ఎక్కువ కలెక్షన్స్

"డ్రింకర్ సాయి"లోని కథా కథనాలు మేకింగ్ అటు మాస్, ఇటు క్లాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలోని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్ అయింది. తెలంగాణతో చూస్తే ఏపీలో ఈ మూవీకి ఎక్కువగా కలెక్షన్స్ వస్తున్నాయి. రూరల్ ఏరియాల్లో సైతం ఇంప్రెసివ్ కలెక్షన్స్ అందుకుంటోంది "డ్రింకర్ సాయి" సినిమా.

డ్రింకర్ సాయి కలెక్షన్స్

ఫన్ ఎలిమెంట్స్, లవ్ స్టోరీ, సూపర్ హిట్ మ్యూజిక్, ఫైట్స్ ఇవన్నీ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. "డ్రింకర్ సాయి" సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దాంతో ఈ సినిమా 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 3.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని మేకర్స్ తెలిపారు.

డ్రింకర్ సాయి బడ్జెట్‌

ఇదిలా ఉంటే, "డ్రింకర్ సాయి" చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మించారు. ఈ సినిమాకు రూ. 6 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందించారు.

మిక్స్‌డ్ టాక్

డిసెంబర్ 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వచ్చిన "డ్రింకర్ సాయి" సినిమాకు మిక్స్‌డ్ టాక్ వస్తోంది. సినిమా స్టోరీలో కాస్తా యూనిక్ పాయింట్ ఉన్నప్పటికీ టేకింగ్ మాత్రం రొటీన్‌గా ఉందని ఆడియెన్స్ తెలిపారు. కానీ, క్లైమాక్స్‌లో మాత్రం మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.

డ్రింకర్ సాయి నటీనటులు

ఇదిలా ఉంటే, డ్రింకర్ సాయి సినిమాలో ధర్మ, ఐశ్వర్య శర్మతోపాటు పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Whats_app_banner