Dream Girl 2 trailer: కడుపుబ్బా నవ్విస్తున్న డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్
Dream Girl 2 trailer: కడుపుబ్బా నవ్విస్తోంది డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్. ఆయుష్మాన్ ఖురానా, అనన్యా పాండే నటించిన ఈ మూవీ నాలుగేళ్ల కిందట వచ్చిన డ్రీమ్ గర్లడ్ మూవీకి సీక్వెల్.
Dream Girl 2 trailer: బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా ఆయుష్మాన్ ఖురానాకు పేరుంది. మొదటి సినిమా నుంచే భిన్నమైన కథలను ఎంచుకుంటూ అతడు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. డ్రీమ్ గర్ల్ మూవీ కూడా అలాంటిదే. 2019లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడీ మూవీ సీక్వెల్ వస్తోంది. తాజాగా మంగళవారం (ఆగస్ట్ 1) డ్రీమ్ గర్ల్ 2 ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఫస్ట్ పార్ట్ లాగే ఈ సీక్వెల్ కూడా కడుపుబ్బా నవ్వించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తేనే ఈ విషయం స్పష్టమవుతోంది. ఫోన్ సెక్స్ చేసే అమ్మాయి పూజా పాత్రలో ఫస్ట్ ఫార్ట్ లో అలరించిన ఆయుష్మాన్.. ఈ సీక్వెల్ లో దానిని మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఈసారి పూజా వాయిసే కాదు.. డ్రెస్సింగ్ లోనూ అతడు అదరగొట్టాడు.
ఈ సినిమాలో రాజ్‌పాల్ యాదవ్, అన్నూ కపూర్, అస్రానీ, పరేష్ రావల్ లాంటి సీనియర్ బాలీవుడ్ నటులు కూడా ఉన్నారు. దీంతో ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక డ్రీమ్ గర్ల్ 2 మూవీలో ఆయుష్మాన్ సరసన అనన్యా పాండే నటిస్తోంది. డ్రీమ్ గర్ల్ మూవీ 2019లో పెద్ద హిట్. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లతో సంచలనం సృష్టించింది.
ఫస్ట్ పార్ట్ లో ఫిమేల్ లీడ్ గా నుష్రత్ బరూచా కనిపించింది. జులైలోనే రిలీజ్ కావాల్సిన డ్రీమ్ గర్ల్ 2 ఇప్పుడు ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ పనులు చాలా ఉండటంతో ఆలస్యమైనట్లు మేకర్స్ వెల్లడించారు. పూజా పాత్రలో ఆయుష్మాన్ ను పర్ఫెక్ట్ గా చూపించే ఉద్దేశంతో వీఎఫ్ఎక్స్ ను కాస్త ఎక్కువగానే వాడినట్లు చెప్పారు.
సంబంధిత కథనం
టాపిక్