OTT: అప్పుడు బాక్సాఫీస్ ఫైట్.. ఇప్పుడు ఓటీటీ క్లాష్.. ఒకే రోజు స్ట్రీమింగ్‍కు రెండు పాపులర్ తమిళ చిత్రాలు
Dargon vs NEEK OTT: రెండు తమిళ పాపులర్ చిత్రాలు ఒకే రోజు ఓటీటీల్లోకి రానున్నాయి. బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ఈ సినిమాలు ఇప్పుడు.. స్ట్రీమింగ్‍లోనూ క్లాష్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇవే..
కోలీవుడ్‍లో గత నెల ఫిబ్రవరిలో ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ క్లాష్ నడిచింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘డ్రాగన్’, స్టార్ హీరో ధనుష్ దర్శకత్వం వహించిన ‘నిలవుకు ఎన్ మెల్ ఎన్నాడి కోబమ్ (NEEK)’ ఒకేరోజున విడుదలయ్యాయి. ఈ రెండు రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఫిబ్రవరి 21న విడుదలయ్యాయి. డ్రాగన్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‍బస్టర్ కొడితే.. నీక్ మాత్రం ప్లాఫ్ అయింది.
ఇప్పుడు ఈ రెండు చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్‍లోనూ పోటీ పడనున్నాయి. ఒకే రోజు వేర్వేరు ప్లాట్‍ఫామ్‍ల్లో రానున్నాయి. బాక్సాఫీస్ క్లాష్ తర్వాత స్ట్రీమింగ్‍లోనూ పోటీపడనున్నాయి.
స్ట్రీమింగ్ వివరాలు
డ్రాగన్ చిత్రం ఈ శుక్రవారం మార్చి 21వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ తెలుగులో ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో విడుదలైంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు డబ్బింగ్‍లోనూ స్ట్రీమ్ అవనుంది.
నీక్ చిత్రం మార్చి 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీ తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా పేరుతో థియేటర్లలో విడుదలైంది. ప్రైమ్ వీడియోలో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది.
డ్రాగన్ హిట్.. నీక్ ఫట్
డ్రాగన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. దాదాపు రూ.37కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం.. ఏకంగా రూ.150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. కమర్షియల్‍గా భారీ సక్సెస్ సాధించింది. మరోవైపు, అదే రోజు రిలీజైన నీక్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ మూవీకి సుమారు రూ.16కోట్ల కలెక్షన్లు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. డ్రాగన్ మూవీకి స్ట్రాంగ్ పాజిటివ్ టాక్ రావటంతో నీక్‍కు గట్టి దెబ్బపడింది. ఇప్పుడు ఓటీటీలో మార్చి 21న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో డ్రాగన్, ప్రైమ్ వీడియోలో నీక్ అడుగుపెట్టనున్నాయి. ఓటీటీ స్ట్రీమింగ్‍లోనూ క్లాష్ అవనున్నాయి.
డ్రాగన్ మూవీకి అశ్వత్ మరిమత్తు దర్శకత్వం వహించారు. ప్రదీప్ రంగనాథన్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. కాలేజ్ బ్యాక్‍డ్రాప్,బ్యాక్‍లాగ్స్, లవ్ బ్రేకప్‍లతో తెరకెక్కిన ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను బాగా మెప్పించింది. ఈ చిత్రాన్ని ఎజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్ ప్రొడ్యూజ్ చేయగా.. లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఇచ్చారు.
ధనుష్ దర్శకత్వం వహించిన నీక్ చిత్రంలో అతడి మేనల్లుడు పవీశ్ నారాయణ్ హీరోగా నటించారు. అనిఖ సురేంద్రన్ హీరోయిన్‍గా చేశారు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్, శరత్ కుమార్, రాబియా ఖాతూన్ కీలకపాత్రల్లో కనిపించారు.
నీక్ మూవీని వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్కే ప్రొడక్షన్స్ ప్రొడ్యూజ్ చేశాయి. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ మూవీ కూడా లవ్ స్టోరీతో రూపొందింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ధనుష్ తెరకెక్కించారు. ఈ మూవీ ముందుగా పాజిటివ్ టాకే వచ్చింది. అయితే ఆ రేంజ్‍లో కలెక్షన్లు మాత్రం రాలేదు. వసూళ్లు డ్రాప్ అయ్యాయి. డ్రాగన్ పోటీలో ఉండటం కూడా నీక్ మూవీకి మైనస్ అయింది.
సంబంధిత కథనం
టాపిక్