Double Ismart Twitter Review: డబుల్ ఇస్మార్ట్ ట్విట్టర్ రివ్యూ - మాస్‌తో రఫ్ఫాడించిన రామ్ - పూరి మార్క్ మిస్
Double Ismart Twitter Review: రామ్ హీరోగా పూరి జగనాథ్ దర్శకత్వంలో రూపొందిన డబుల్ ఇస్మార్ట్ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉందంటే?
Double Ismart Twitter Review: ఇస్మార్ట్ శంకర్ తర్వాత హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన మూవీ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. డబుల్ ఇస్మార్ట్‌కు ముందు లైగర్‌తో పూరి జగన్నాథ్, స్కందతో రామ్ పోతినేని పరాజయాలను అందుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ సక్సెస్ ఇద్దరికి కీలకంగా మారింది. ఈ మూవీ ఓవర్‌సీస్ ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది? సీక్వెల్‌తో హిట్ అందుకున్నారా లేదా అంటే…
పేరుకే సీక్వెల్....
డబుల్ ఇస్మార్ట్ ప్రీమియర్స్‌కు నెగెటివ్ టాక్ వస్తోంది. పేరుకు సీక్వెల్ అయినా...ఇస్మార్ట్ శంకర్ కథనే అటు తిప్పి...ఇటు తిప్పి డైరెక్టర్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ చేసినట్లు నెటిజన్లు చెబుతోన్నారు. రామ్ ఎనర్జీ మాత్రమే డబుల్ ఇస్మార్ట్‌ను సేవ్ చేసినట్లు ట్వీట్స్ చేస్తున్నారు.
ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్...
కంప్లీట్ రొటీన్, ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో డబుల్ ఇస్మార్ట్ మూవీ సాగుతుందని అంటున్నారు. పూరి జగన్నాథ్ టేకింగ్‌లోనూ కొత్తదనం కనిపించలేదని చెబుతోన్నారు. హీరో క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న డ్రామా చాలా ఆర్టిఫీషియల్‌గా ఉందని కామెంట్స్ చేస్తోన్నారు.
రివేంజ్ డ్రామా...
అలీ క్రింజ్ కామెడీని భరించడం కష్టమేనని అంటున్నారు. సాదాసీదా రివేంజ్ డ్రామా కథతో డబుల్ ఇస్మార్ట్‌ను పూరి జగన్నాథ్ తెరకెక్కించాడని ట్వీట్స్ చేస్తున్నారు. పూరి మార్క్ సినిమాలో మిస్సయిందని కామెంట్స్ చేస్తున్నారు. చిప్ కాన్సెప్ట్ అనే ఐడియా బాగున్నా ఎక్కడ లాజిక్స్ కనిపించవని అంటున్నారు. సంజయ్ దత్ పాత్ర కూడా లాజిక్ లెస్‌గా సాగుతుందని చెబుతోన్నారు.
రామ్ రఫ్ఫాడించాడు...
రామ్ డైలాగ్స్, మేనరిజమ్స్ బాగున్నాయని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తోన్నారు. మాస్ క్యారెక్టర్‌లో రఫ్ఫాడించాడని చెబుతోన్నారు. మదర్ సెంటిమెంట్ సీన్స్ వర్కవుట్ అయ్యాయని అంటున్నారు. మణిశర్మ మ్యూజిక్ బిగ్గెస్ట్ రిలీఫ్‌గా ఈ మూవీని నిలిచిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
డబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ప్రొడ్యూస్ చేశాడు.