Dooradarshini: ఆ గోల్డెన్ డేస్‌లోకి తీసుకెళ్తుంది.. ప్రతి ఒక్కరు నా కథ అనుకుంటారు.. దూరదర్శిని టైటిల్ టీజర్ రిలీజ్-dooradarshini title teaser released by rp patnaik and suvikshith geethika ratan gemini suresh comments on this movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dooradarshini: ఆ గోల్డెన్ డేస్‌లోకి తీసుకెళ్తుంది.. ప్రతి ఒక్కరు నా కథ అనుకుంటారు.. దూరదర్శిని టైటిల్ టీజర్ రిలీజ్

Dooradarshini: ఆ గోల్డెన్ డేస్‌లోకి తీసుకెళ్తుంది.. ప్రతి ఒక్కరు నా కథ అనుకుంటారు.. దూరదర్శిని టైటిల్ టీజర్ రిలీజ్

Sanjiv Kumar HT Telugu
Dec 29, 2024 05:12 PM IST

Dooradarshini Title Teaser Released: తెలుగులో హృదయాలను అత్తుకునే ప్రేమకథగా వస్తోందని మూవీ మేకర్స్ చెబుతున్న సినిమా దూరదర్శిని. ఇటీవల దూరదర్శిని టైటిల్ టీజర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో సినిమాలో హీరో సువిక్షిత్, హీరోయిన్ గీతిక రతన్ దూరదర్శినిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆ గోల్డెన్ డేస్‌లోకి తీసుకెళ్తుంది.. ప్రతి ఒక్కరు నా కథ అనుకుంటారు.. దూరదర్శిని టైటిల్ టీజర్ రిలీజ్
ఆ గోల్డెన్ డేస్‌లోకి తీసుకెళ్తుంది.. ప్రతి ఒక్కరు నా కథ అనుకుంటారు.. దూరదర్శిని టైటిల్ టీజర్ రిలీజ్

Dooradarshini Title Teaser Released: సువిక్షిత్‌ బొజ్జ, గీతిక రతన్‌ హీరో హీరోయిన్లుగా జంటగా నటిస్తున్న చిత్రం 'దూరదర్శిని'. 'కలిపింది ఇద్దరిని' అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహ మూవీ మేకర్స్‌ పతాకంపై బి. సాయి ప్రతాప్‌ రెడ్డి, జయ శంకర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోంది.

yearly horoscope entry point

దూరదర్శిని టైటిల్ టీజర్ రిలీజ్

1990వ నేపథ్యంలో అందరి హృదయాలను హత్తుకునే ప్రేమకథగా రూపొందుతున్న దూరదర్శిని టైటిల్‌ టీజర్‌ను ఇటీవల ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్‌ విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్పీ పట్నాయక్‌తోపాటు హీరో హీరోయిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆర్‌పీ పట్నాయక్‌ మాట్లాడుతూ.. ''ఈ చిత్ర కథానాయకుడు చాలా కాలంగా తెలుసు. జెమిని సురేష్‌ ఈ సినిమా గురించి చాలా చెప్పాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పే వాడు. ఈ సినిమాకు చాలా పాజిటివ్‌ వైబ్స్‌ ఉన్నాయి. ఈ సినిమా అందరిని 90వ దశకంలోకి తీసుకెళ్లి మీ జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అందరికి వాళ్ల వాళ్ల ప్రేమకథలు కూడా గుర్తుకు వస్తాయి. ఈ సినిమా విజయం సాధించి టీమ్‌ అందరికి మంచి గుర్తింపు తీసుకరావాలి'' అన్నారు.

గోల్డెన్ డేస్‌కు తీసుకెళ్తుంది

జెమిని సురేష్‌ మాట్లాడుతూ.. '' సినిమా పరిశ్రమలో స్థిరపడాలనే సంకల్పంతో సువిక్షిత్‌ ఈ సినిమా తీశాడు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డాడు. 90వ దశకంలోని పూర్తి డిటైల్డ్‌గా దర్శకుడు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అందరిని మళ్లీ మీ చిన్ననాటి గోల్డెన్‌డేస్‌కు తీసుకవెళుతుంది. చాలా రోజుల తరువాత నాకు ఈ చిత్రంలో మంచి పాత్ర దొరికింది. దూరదర్శిని సినిమా నటుడిగా నాకు ఓ ప్రత్యేక సినిమాగా ఉంటుంది'' అని తెలిపారు.

''దూరదర్శిని సినిమా చాలా మంచి చిత్రం. తప్పకుండా అందరికి తమ మరపురాని రోజులను గుర్తుకు తెస్తుంది. నాకు ఈ చిత్రంలో అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. ఈ సినిమాలో దూరదర్శిని వాణి, హరిల ప్రేమను ఎలా కలిపింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది'' అని హీరోయిన్ గీతిక చెప్పుకొచ్చింది.

ఇది నా కథ అనుకుంటారు

''ఇది 1990వ నేపథ్యంలో నడిచే కథ. అందరికి కనెక్ట్‌ అయ్యే కథ ఇది. బ్యాక్‌డ్రాప్‌కు తగ్గ నటీనటులతో, లోకేషన్స్‌తో ఎంతో సహజంగా తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమా కోసం అందరం ఎంతో రీసెర్చ్‌ చేసి ఎంతో డిటైల్డ్‌గా దర్శకుడు చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమాలో ఉన్న ఎమోషనే ఈ చిత్రంలోని ప్లస్‌ పాయింట్‌. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది నా కథ అనుకుంటారు. అందరూ ఎంతోగా కనెక్ట్‌ అవుతారు. తప్పకుండా చిత్రాన్ని అందరూ ఎంతో బాగా ఎంజాయ్‌ చేస్తారు'' అని హీరో సువిక్షిత్ అన్నాడు.

కాగా ఈ సమావేశంలో దర్శకుడు కార్తియక కొమ్మి, తిరుపతి రెడ్డి, నారాయణ, కొరియోగ్రాఫర్‌ సునీల్‌ పొన్నం, బాలారాజు, తేజ, పాండు, జెమిని సురేష్‌, గీతిక, డీఓపీ సతీష్‌, తదితరులు పాల్గొన్నారు. ఇక దూరదర్శిని సినిమాలో సువిక్షిత్‌ బొజ్జ, గీతిక రతన్‌, జెమిని సురేష్‌, లావణ్య రెడ్డి, కిట్టయ్య తదితరులు నటిస్తున్నారు.

Whats_app_banner