OTT Horror: కోరిన కోరికలు తీర్చే దెయ్యాలు.. ఓటీటీలోకి వచ్చిన న్యూ కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-do you see what i see ott streaming in netflix ott horror thriller movies do you see what i see explained in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Horror: కోరిన కోరికలు తీర్చే దెయ్యాలు.. ఓటీటీలోకి వచ్చిన న్యూ కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Horror: కోరిన కోరికలు తీర్చే దెయ్యాలు.. ఓటీటీలోకి వచ్చిన న్యూ కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 06, 2024 04:17 PM IST

Do You See What I See OTT Streaming: ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ డూ యూ సీ వాట్ ఐ సీ. గత కొన్ని రోజులుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ హారర్ సినిమాలో కోరిన కోరికలను దెయ్యాలు తీర్చే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. మరి ఈ హారర్ మూవీ డూ యూ సీ వాట్ ఐ సీ ఓటీటీ రిలీజ్‌పై లుక్కేద్దాం.

కోరిన కోరికలు తీర్చే దెయ్యాలు.. ఓటీటీలోకి వచ్చిన న్యూ కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోరిన కోరికలు తీర్చే దెయ్యాలు.. ఓటీటీలోకి వచ్చిన న్యూ కాన్సెప్ట్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Do You See What I See OTT Release: హారర్, క్రైమ్, కామెడీ, బోల్డ్, కామెడీ వంటి జోనర్ సినిమాలకు ఓటీటీలో ఫుల్ గిరాకీ ఉంటుంది. అంటే. ఈ తరహా జోనర్ చిత్రాలను, వెబ్ సిరీసులను ప్రేక్షకులు చూసేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఇక హారర్ థ్రిల్లర్స్‌పై మరింత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

డిఫరెంట్ హారర్ మూవీ

ప్రతి మనిషిలో ఉండే మేజర్ ఎలిమెంట్ భయం. అందుకే దాని చుట్టు తెరకెక్కే సినిమాలపై ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగానే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో హారర్ మూవీస్‌లను తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. అలా ఇటీవల ఓటీటీలోకి వచ్చిన హారర్ థ్రిల్లర్ మూవీనే డూ యూ వాట్ ఐ సీ.

అడిగిన, కోరిన కోరికలను తీర్చడం, అమ్మాయికి బాయ్‌ఫ్రెండ్‌ను ప్రసాదించేటువంటి దెయ్యాల కాన్సెప్ట్‌తో డూ యూ వాట్ ఐ సీ మూవీ తెరకెక్కింది. 2024లో మేలో వచ్చిన హారర్ మూవీనే డూ యూ వాట్ ఐ సీ. ఇందులో తల్లిదండ్రులు చనిపోయిన ఓ అమ్మాయి మావర్‌ను ఫ్రెండ్స్ కాస్తా హేళన చేస్తుంటారు. తనతో మావర్ స్నేహితులు సరదాగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు మితిమీరిపోతుంటుంది.

తల్లిదండ్రుల సమాధి వద్ద

ఇలాంటి సమయంలో మంచి బాయ్‌ఫ్రెండ్ కోసం ఉవ్విళ్లూరుతుంటుంది మావర్. ఆమెకు కనిపించని పలు శక్తులు సహాయం కూడా చేస్తాయి. ఓ రోజు తన పుట్టినరోజు కావడంతో తల్లిదండ్రుల సమాధుల దగ్గరికి వెళ్లి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంది మావర్. తన పుట్టినరోజు తల్లిదండ్రులు బతికి ఉంటే ఎంతో బాగుండేదని, తాను అడిగింది కొని తీసుకొచ్చేవారని ఎమోషనల్ అవుతుంది మావర్.

తల్లిదండ్రుల లేని లోటును ఎవరు తీర్చలేరని, తన 20వ పుట్టినరోజు కావడంతో తనను ఆప్యాయంగా చూసుకునే మంచి బాయ్‌ప్రాండ్‌ కావాలని, అతన్ని మీరే చూసి పెట్టాలని సమాధులవైపు చూస్తూ అడుగుతుంది మావర్. కట్ చేస్తే హీరోయిన్ తన ఫ్రెండ్స్‌తో ఉంటే హాస్టల్‌కు తిరిగి వెళ్లిపోతుంది.

హీరోయిన్‌లో మార్పు

ఆ తర్వాత హీరోయిన్‌కు నిజంగానే బాయ్‌ఫ్రెండ్ దొరుకుతాడు. ఆ విషయం ఫ్రెండ్స్‌కు చెప్పి తెగ సంబరపడిపోతుంది. అప్పటి నుంచి మావర్ ప్రవర్తనలో మార్పు రావడం తన స్నేహితురాళ్లు గమనిస్తారు. అనంతరం మావర్ ఫ్రెండ్స్‌కు తరచుగా ఏవో శబ్ధాలు రావడం, ఫోన్‌లో వింత సౌండ్స్, ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి.

చివరికి ఏమైంది, మావర్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మావర్ బాయ్‌ఫ్రెండ్ ఏమవుతాడు? మావర్ ఫ్రెండ్స్‌ను దెయ్యాలు ఎందుకు టార్గెట్ చేశాయి? వాళ్లకు కాల్స్ ఎవరు చేస్తున్నారు? హీరోయన్ తల్లిదండ్రులు ఎవరు? దెయ్యాలుగా మారిన వారు మావర్‌కు ఎలా సహాయం అందించారు? అనే ఆసక్తికర సీన్స్‌తో భయపెట్టే సన్నివేశాలతో డూ యూ సీ వాట్ ఐ సీ మూవీ సాగుతుంది.

రన్ టైమ్, ఓటీటీ రిలీజ్

వెన్నులో వణుకుపుట్టించే సీన్స్‌తో తెరకెక్కిన డూ యూ వాట్ ఐ సీ (Do You See What I See) మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. గంట 49 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో కేవలం ఇండోనేషియా లాంగ్వేజ్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. అయితే, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో మాత్రం ఈ హారర్ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Whats_app_banner