Kalki 2898 AD: అలాంటివి చేయొద్దు: కల్కి 2898 ఏడీ మేకర్స్ సూచనలు.. థియేటర్ల వద్ద హంగామా షురూ: వీడియోలు-do not give spoilers kalki 2898 ad makers request to the portals critics and prabhas fans celebrations at theatres start ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kalki 2898 Ad: అలాంటివి చేయొద్దు: కల్కి 2898 ఏడీ మేకర్స్ సూచనలు.. థియేటర్ల వద్ద హంగామా షురూ: వీడియోలు

Kalki 2898 AD: అలాంటివి చేయొద్దు: కల్కి 2898 ఏడీ మేకర్స్ సూచనలు.. థియేటర్ల వద్ద హంగామా షురూ: వీడియోలు

Chatakonda Krishna Prakash HT Telugu
Jun 26, 2024 11:18 PM IST

Kalki 2898 AD: కల్కి 2898 ఏడీ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ మేకర్స్ కొన్ని సూచనలు వెల్లడించారు. ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్ చెడగొట్టొద్దని రిక్వెస్ట్ చేశారు.

Kalki 2898 AD: అలాంటివి చేయొద్దు: కల్కి 2898 మేకర్స్ సూచనలు.. థియేటర్ల వద్ద హంగామా షురూ: వీడియోలు
Kalki 2898 AD: అలాంటివి చేయొద్దు: కల్కి 2898 మేకర్స్ సూచనలు.. థియేటర్ల వద్ద హంగామా షురూ: వీడియోలు

ఆకాశమంత అంచనాలు ఉన్న కల్కి 2898 ఏడీ సినిమా ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం రేపు (జూన 27) రిలీజ్ కానుంది. తెల్లవారుజాము నుంచే చాలా చోట్ల షోలు పడనున్నాయి. ఈ చిత్రంపై అందరిలోనూ ఎంతో ఆసక్తి ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 ఏడీ సినిమాలో చాలా ముఖ్యమైన ట్విస్టులు, బోలెడు సర్‌ప్రైజ్‍లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఈ మూవీ మేకర్స్ కొన్ని సూచనలు చేశారు. స్పాయిలర్లు ఇవ్వొద్దని చెప్పడం సహా మరిన్ని సూచనలు ఇచ్చారు.

ఇవి వద్దు

కల్కి 2898 ఏడీ విషయంలో మూవీ టీమ్ సూచనలు చేసింది. స్పాయిలర్స్, నిమిష నిమిషానికి అప్‍డేట్స్ లాంటివి ఇవ్వొద్దని సూచించింది. ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్ చెడగొట్టొద్దని నేడు (జూన్ 26) ఓ నోట్ రిలీజ్ చేసింది వైజయంతీ మూవీస్. సోషల్ మీడియా సహా వివిధ ప్లాట్‍ఫామ్‍ల ద్వారా స్పాయిలర్స్ ఇవ్వొద్దనేలా చెప్పింది.

గ్లోబల్ స్కేల్‍లో ఈ కథను తీసుకొచ్చామని, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదని వైజయంతీ మూవీస్ పేర్కొంది. “నాగ్ అశ్విన్, అతడి టీమ్ నాలుగు సంవత్సరాలు తీవ్రంగా కష్టపడిన కథ ఇది. ఆ స్టోరీని గ్లోబల్ స్కేల్‍లో తీసుకొచ్చేందుకు అన్ని విధాల శ్రమించారు. క్వాలిటీ విషయంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు, రాజీపడలేదు. దీన్ని ముందుకు తీసుకొచ్చేందుకు టీమ్ తమ రక్తాన్ని, చెమటను పెట్టింది” అని వైజయంతీ మూవీస్ తెలిపింది.

అందుకే సినిమాను గౌరవించాలని, స్పాయిలర్స్, పైరసీ లాంటివి ఇచ్చి ప్రేక్షకుల అనుభూతిని దెబ్బతీయవద్దని అందరినీ రిక్వెస్ట్ చేసింది. “సినిమాను, కళను దయచేసి గౌరవించండి. స్పాయిలర్లు, మినిట్ బై మినిట్ అప్‍డేట్లు, పైరసీ లాంటివి చేయవద్దని అభ్యర్థిస్తున్నాం. ప్రేక్షకుల ఎక్స్‌పీరియన్స్‌ను చెడగొట్టవద్దు. ఈ సినిమా కంటెంట్‍ను పరిరక్షించేందుకు, విజయాన్ని కలిసి సెలెబ్రేట్ చేసుకునేందుకు చేతులు కలపండి” అంటూ వైజయంతీ మూవీస్ కోరింది. ముందుగా సినిమా చూసే వారు కూడా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టొద్దనేలా పైరసీ అంటూ సూచనలు చేసింది.

థియేటర్ల వద్ద అప్పుడే హంగామా

కల్కి 2898 ఏడీ సినిమా షోలు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామునే మొదలుకాన్నాయి. ఈ తరుణంలో ఇప్పటికే కొన్ని థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల హంగామా షురూ అయింది. డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. హైదరాబాద్‍లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్ల వద్ద వేల సంఖ్యలో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మరిన్ని థియేటర్ల వద్ద కూడా సందడి మొదలైపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గ్రాండ్ విజువల్స్‌, భారీ వీఎఫ్‍ఎక్స్‌తో భారత పురాణాల ఆధారంగా సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి 2898 ఏడీని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ లాంటి భారీ తారాగణం ఉంది. ఈ మూవీపై ఫుల్ హైప్ ఉంది. కలెక్షన్లలో రికార్డులను బద్దలుకొడుతుందనే అంచనాలు ఉన్నాయి. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.200కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వస్తాయని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.

WhatsApp channel