Hotstar OTT: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇవాళ్టీ టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు.. అన్నీ తెలుగులోనే.. మీరెన్ని చూశారు?-disney plus hotstar ott top 6 trending movies today in telugu kobali sookshmadarshini heart beat barroz ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hotstar Ott: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇవాళ్టీ టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు.. అన్నీ తెలుగులోనే.. మీరెన్ని చూశారు?

Hotstar OTT: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇవాళ్టీ టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు.. అన్నీ తెలుగులోనే.. మీరెన్ని చూశారు?

Sanjiv Kumar HT Telugu
Published Feb 06, 2025 03:08 PM IST

Disney Plus Hotstar OTT Movies Trending Today: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇవాళ ట్రెండింగ్ అవుతోన్న టాప్ 6 సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం. వాటిలో రివేంజ్ క్రైమ్, అడ్వెంచర్, ఫాంటసీ, మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇవాళ్టీ టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ఇవాళ్టీ టాప్ 6 ట్రెండింగ్ సినిమాలు (Disney Plus Hotstar)

Disney Plus Hotstar OTT Trending Movies Today: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. మలయాళం, హిందీ, తమిళ సినిమాలతోపాటు జోరుగా తెలుగు కంటెంట్ అందిస్తోంది. అలాగే, ఇతర భాషా చిత్రాలు, వెబ్ సిరీసులను తెలుగులో స్ట్రీమింగ్ చేస్తూ ట్రెండ్ అవుతోంది. అయితే, ఇవాళ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ ట్రెండింగ్ అవుతోన్న టాప్ 6 సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

కోబలి ఓటీటీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీ టాప్ 1 ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్ కోబలి. తెలుగు రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌గా తెరకెక్కిన కోబలి ఫిబ్రవరి 4 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో హత్యలు, పగలు, ప్రతికారం వంటి అంశాలతో కోబలి తెరకెక్కింది. ఇందులో నటుడు రవి ప్రకాష్, యాంకర్ శ్యామల తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ది సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్ ఓటీటీ

జనవరి 31 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజ్ అయిన హిందీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ది సీక్రెట్స్ ఆఫ్ ది షిలేదార్స్. 10కి 7 ఐఎమ్‌డీబీ రేటింగ్ తెచ్చుకున్న ఈ సిరీస్ తెలుగు వెర్షన్ హాట్‌స్టార్‌లో టాప్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఛత్రపతి శివాజీ నిధుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ సిరీస్ తెలుగు ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంటోందని తెలుస్తోంది.

సూక్షదర్శిని ఓటీటీ

పుష్ప విలన్, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ భార్య, హీరోయిన్ నజ్రియా నజీమ్, యాక్టర్ అండ్ డైరెక్టర్ బసిల్ జోసెఫ్ మెయన్ లీడ్ రోల్స్‌లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ సూక్షదర్శిని. విమర్శకులు ప్రశంసలు అందుకున్న ఈ మలయాళ సినిమా ఇప్పటికీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. ఇవాళ టాప్ 3 స్థానంలో ప్లేస్ సంపాదించుకుని సత్తా చాటింది.

హార్ట్ బీట్ ఓటీటీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో టాప్ 4 స్థానంలో కార్టూన్ సిరీస్ డోరమాన్ ట్రెండింగ్‌లో ఉండగా.. టాప్ 5లో తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ వెబ్ సిరీస్ హార్ట్ బీట్ స్థానం సంపాదించుకుంది. టాప్ 4, టాప్ 5 స్థానల్లో ఈ రెండు హాట్‌‌స్టార్‌లో ఇవాళ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.

బరోజ్ 3డీ ఓటీటీ

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించిన బరోజ్ 3డీ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో టాప్ 6 ప్లేస్ సంపాదించుకుంది. వాస్కోడిగామా నిధిని రక్షించి అతని వారసులకు అప్పగించే బరోజ్ అనే భూతంగా మోహన్ లాల్ కనిపించారు. ప్లాప్‌గా మిగిలిన ఈ మలయాళ ఫాంటసీ అడ్వెంచర్ కామెడీ సినిమా హాట్‌స్టార్‌లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

Whats_app_banner

సంబంధిత కథనం