Disney Plus Hotstar OTT Movies: డిస్నీ హాట్‌స్టార్‌లో సరికొత్త సినిమాలు.. 4 మాత్రం స్పెషల్!
New OTT Releases In Disney Plus Hotstar: ఎప్పటికప్పుడు ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు విడుదల అవుతూ ఉంటాయి. అలా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదలైన కొత్త సినిమాలు, వెబ్ సిరీసులు ఏంటో లుక్కేద్దాం.
Disney Plus Hotstar Latest OTT Releases: ఎప్పటికప్పుడు న్యూ మూవీస్, లేటెస్ట్ వెబ్ సిరీసులు విడుదల చేస్తూ సినీ ప్రియులను ఊరిస్తుంటాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. అందులో పాపులర్ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో లేటెస్ట్ రిలీజ్ సినిమాలు, సరికొత్త జోనర్లతో వెబ్ సిరీసులను విడుదల చేస్తుంటుంది. అలా తాజాగా ఈవారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీసులు చూద్దాం.
చిన్నా మూవీ
హీరో సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ తమిళ మూవీ చిత్తా. సెప్టెంబర్ 28న తమిళంలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో చిన్నా అనే టైటిల్‌తో రిలీజ్ చేశారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన చిన్నా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు చిన్నా మూవీ ఓటీటీలోకి రానుంది. హాట్ స్టార్‌లో నవంబర్ 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
కన్నూరు స్క్వాడ్
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కన్నూర్ స్క్వాడ్. మలయాళంలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నవంబర్ 17 నుంచి తెలుగు భాషలో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సినిమాకు రాబీ వర్గీస్ రాజ్ దర్శకత్వం వహించారు.
అపూర్వ
తారా సుతారియా, అభిషేక్ బెనర్జీ (రానా నాయుడు ఫేమ్), రాజ్‌పాల్ యాదవ్, ధైర్య కర్వా ప్రధాన పాత్రలు పోషించిన మూవీ అపూర్వ. సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన అపూర్వ సినిమాకు నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. క్రిమినల్స్ గ్యాంగ్ నుంచి కిడ్నాప్ అయిన ఓ యువతి ఎలా తప్పించుకుందో చూపించే కథతో తెరకెక్కిన అపూర్వ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నవంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇవే కాకుండా కింద మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
డ్యాషింగ్ త్రు ది స్నో- నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్
లేబుల్- నవంబర్ 10 నుంచి స్ట్రీమింగ్
ది సాంటా క్లాజెస్- నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్
విజిలాంటే- నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్
వాలట్టీ: టేల్ ఆఫ్ టేయిల్స్- నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్