Telugu Web Series: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మూవీ టైటిల్‌తో తెలుగు వెబ్‌సిరీస్ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Web Series::మరో కొత్త తెలుగు వెబ్‌సిరీస్‌ను హాట్‌స్టార్ అనౌన్స్ చేసింది. కోబలి పేరుతో ఈ వెబ్‌సిరీస్ తెరకెక్కబోతున్నట్లు ప్రకటించింది. గతంలో కోబలి టైటిల్‌తో పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేయాలని అనుకున్నారు. అదే టైటిల్‌తో ఈ వెబ్‌సిరీస్ రానుండటం ఆసక్తికరంగా మారింది.
Kobali Web Series: పవన్ కళ్యాణ్ కోబలి టైటిల్‌తో తెలుగులో ఓ వెబ్‌సిరీస్ వస్తోంది. ఈ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో ఏదన్నది రివీలైంది. కోబలి వెబ్‌సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లోస్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్‌సిరీస్ అప్‌డేట్‌ను హాట్‌స్టార్ శుక్రవారం రివీల్ చేసింది.
టైటిల్‌తో పాటు ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రక్తం మరకలు ఉన్న కత్తిపై ప్రధాన పాత్రధారుల ముఖాలను చూపిస్తూడిఫరెంట్‌గా డిజైన్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో పాతకాలం నాటి ఇంటిగోడ కనిపిస్తోంది. రక్తపాతానికి సిద్ధం అంటూ పోస్టర్‌కు జోడించిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.
రవి ప్రకాష్...
కోబలి వెబ్‌సిరీస్‌లో నటిస్తోన్న యాక్టర్లు ఎవరన్నది హాట్‌స్టార్ రివీల్ చేయలేదు. డైరెక్టర్ ఎవరు, ప్రొడక్షన్ హౌజ్ ఏదన్నది కూడా వెల్లడించలేదు. హాట్‌స్టార్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో రవి ప్రకాష్, శ్రీతేజ్‌తో పాటు మరో ఇద్దరు కనిపిస్తోన్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో రవి ప్రకాష్ లీడ్ రోల్‌లో కనిపిస్తోన్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఈ వెబ్‌సిరీస్ యాక్టర్స్, టెక్నీషియన్లతోపాటు రిలీజ్ డేట్‌ను హాట్ స్టార్ రివీల్ చేయబోతున్నట్లు సమాచారం.
రివేంజ్ డ్రామా...
రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో రివేంజ్ డ్రామాగా కోబలి వెబ్‌సిరీస్ తెరకెక్కుతోన్నట్లు సమాచారం. పగ, ప్రతీకారాల కారణంగా కొందరు జీవితాలు ఏమయ్యాయన్నది ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్...
కోబలి పేరుతో గతంలో పవన్ కళ్యాణ్ , డైరెక్టర్ త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేయాలని అనుకున్నారు. కోబలి టైటిల్‌ను త్రివిక్రమ్ అనౌన్స్‌చేశాడు. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తోన్నట్లు త్రివిక్రమ్ ప్రకటించాడు. పాటలు, హీరోయిన్ లేకుండా కేవలం గంట నలభై ఐదు నిమిషాల నిడివితో ప్రయోగాత్మకంగా కోబలి సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్ భావించారు.
2014లోనే రావాల్సింది కానీ...
2014లోనే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ ఆ టైమ్‌లో పవన్ కళ్యాణ్ ఎన్నికలతో బిజీ కావడంతో షూటింగ్ డిలే అయ్యింది. ఆ తర్వాత కూడా కోబలి సినిమా పట్టాలెక్కలేదు. కోబలి స్థానంలో అజ్ఞాతవాసి సినిమా చేశారు. ఇప్పుడు ఆ టైటిల్‌తో తెలుగులో వెబ్‌సిరీస్ రావడం ఆసక్తికరంగా మారింది.
హరికథ...
ఇటీవలే హాట్‌స్టార్‌లో రిలీజైన హరికథ వెబ్‌సిరీస్ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన ఈ వెబ్‌సిరీస్‌లో రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి కీలక పాత్రలు పోషించారు.