OTT New Web Series: ఓటీటీలోకి కొత్తగా సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఊపిరి బిగబెట్టి చూసేలా ‘పారాచ్యూట్’ ట్విస్ట్‌లు
Parachute OTT release date: స్ట్రిక్ట్‌గా ఉండే తండ్రికి తెలియకుండా రెగ్యులర్‌గా అతని బైక్‌పై చక్కర్లు కొట్టే ఇద్దరు చిన్న పిల్లలు.. ఒకరోజు బైక్‌తో పాటు మిస్ అవుతారు. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల కోసం డిస్నీ+ హాట్‌స్టార్‌లో ‘పారాచ్యూట్’ అనే వెబ్ సిరీస్ రాబోతోంది. ఇంట్లో మిడిల్ క్లాస్ స్ట్రిక్ట్ తండ్రికి తెలియకుండా బైక్‌పై దొంగగా ప్రయాణించే ఇద్దరు పిల్లలు.. అనూహ్య పరిస్థితుల్లో చిక్కుల్లో పడతారు. ఇక అక్కడి నుంచి మొదలయ్యే కథ.. వరుస ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్
రాసు రంజిత్ దర్శకత్వం వహించిన ఈ ‘పారాచ్యూట్’ వెబ్ సిరీస్‌లో తమిళ నటులు నటుడు కిషోర్, 'కుకు విత్ కోమలి' ఫేమ్ కని జంటగా నటించారు. అలానే పోలీస్ పాత్రలో కృష్ణ కులశేఖరన్ నటించారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే? కృష్ణ ఈ సిరీస్‌లో నటించడమే కాకుండా ఈ సిరీస్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు. థ్రిల్లర్ సిరీస్‌లకి సంగీతం ప్రాణం. ఈ పారాచ్యూట్ సిరీస్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
తండ్రికి తెలియకుండా వెళ్లి
స్ట్రిక్ట్‌గా ఉండే తండ్రి మోహన్‌కి భయపడి ఇంట్లోని పిల్లలు.. కనీసం అతనితో మాట్లాడటానికి కూడా జంకుతుంటారు. అయితే.. ఆ పిల్లలకి బైక్‌పై వెళ్లాలనే కోరిక ఉంటుంది. దాంతో తండ్రికి తెలియకుండానే అతని పాత మోపెడ్‌పై ఊరంతా చక్కర్లు కొడుతుంటారు.
ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
కానీ.. ఈ క్రమంలో ఒకరోజు బైక్‌తో పాటు పిల్లలు కూడా కనిపించకుండా పోతారు. వాళ్లను ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఆ బైక్ దొంగతనం చేసింది ఎవరు? బైక్‌తో ఫ్యామిలీకి ఉన్న బంధం ఏంటి? పోలీసుల ఎంట్రీ తర్వాత ఆ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
నవంబరు 29 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఈ పారాచ్యూట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉండనుంది.