Poorna Dark Night: ఎమోషనల్ థ్రిల్లర్‌గా పూర్ణ డార్క్ నైట్.. 4 పాత్రల మధ్య అల్లిన కథ.. డైరెక్టర్ వివి వినాయక్ కామెంట్స్-director vv vinayak released poorna trigun dark night movie teaser and producer suresh reddy kovvuri comments ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Poorna Dark Night: ఎమోషనల్ థ్రిల్లర్‌గా పూర్ణ డార్క్ నైట్.. 4 పాత్రల మధ్య అల్లిన కథ.. డైరెక్టర్ వివి వినాయక్ కామెంట్స్

Poorna Dark Night: ఎమోషనల్ థ్రిల్లర్‌గా పూర్ణ డార్క్ నైట్.. 4 పాత్రల మధ్య అల్లిన కథ.. డైరెక్టర్ వివి వినాయక్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Feb 15, 2025 01:38 PM IST

VV Vinayak Suresh Reddy Kovvuri About Poorna Dark Night: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ డార్క్ నైట్. తాజాగా డార్క్ నైట్ టీజర్‌ను డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా, వివి వినాయక్, నిర్మాత కామెంట్స్ చేశారు.

ఎమోషనల్ థ్రిల్లర్‌గా పూర్ణ డార్క్ నైట్.. 4 పాత్రల మధ్య అల్లిన కథ.. డైరెక్టర్ వివి వినాయక్ కామెంట్స్
ఎమోషనల్ థ్రిల్లర్‌గా పూర్ణ డార్క్ నైట్.. 4 పాత్రల మధ్య అల్లిన కథ.. డైరెక్టర్ వివి వినాయక్ కామెంట్స్

VV Vinayak Suresh Reddy Kovvuri About Poorna Dark Night: టాలీవుడ్ హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో P19 ట్రాన్స్‌మీడియా స్టూడియోస్ పతాకంపై పటోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించిన ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రం "డార్క్ నైట్". ఈ సినిమాకు జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించారు.

బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు

పూర్ణకు జోడీగా కథ, వీకెండ్ లవ్, పివిఎస్ గరుడవేగా, 24 కిస్సెస్, కథ కంచికి మనం ఇంటికి, ప్రేమదేశం, మనమే వంటి చిత్రాలలో నటించిన త్రిగుణ్ (ఆదిత్ అరుణ్) నటించగా విధార్థ్, బిగ్ బాస్ బ్యూటి శుభశ్రీ రాయగురు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సెన్సార్‌కి డార్క్ నైట్ మూవీ రెడీగా ఉంది.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే సందర్భంగా డార్క్ నైట్ మూవీ టీజర్‌ను దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వివి వినాయక్‌తోపాటు నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మా ప్రాంతం నుంచి వచ్చి

డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ.. "సురేష్ రెడ్డి గారు మా ప్రాంతం నుంచి వచ్చి నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు డార్క్ నైట్ చిత్రంతో పరిచయం అయ్యారు చాలా సంతోషం. ప్రస్తుతం థ్రిల్లర్ కథ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ముఖ్యంగా యూత్" అని చెప్పారు.

"పీ19 ట్రాన్స్‌మీడియా స్టూడియోస్ బ్యానర్‌లో తొలి చిత్రంగా పూర్ణ, త్రిగుణ్ మెయిన్ లీడ్‌గా వస్తున్నడార్క్ నైట్ తప్పక విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం విజయంతో ఆయన మరిన్ని చిత్రాలు తీసి తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా నిలబడాలని ఆశిస్తున్నాను." అని డైరెక్టర్ వివి వినాయక్ కోరారు.

పూర్ణ నటన అద్భుతంగా ఉంటుంది

నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ.. "మా సినిమా టీజర్ విడుదల చేసినందుకు డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారికి ధన్యవాదాలు. తెలుగులో ఎమోషనల్ థ్రిల్లర్‌గా వచ్చిన 'అవును 1,' అండ్ 'అవును 2' చిత్రాలలో పూర్ణ నటన అద్భుతంగా ఉంటుంది. ఆ చిత్రాలతోనే ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రాలకు అతీతంగా డార్క్ నైట్‌లో ఆమె నటన హైలెట్‌గా నిలుస్తుంది" అని తెలిపారు.

"మళ్లీ ఇన్నాలకు ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు అనుగుణంగా ఎమోషనల్‌గా సాగే థ్రిల్లర్ కథతో డార్క్ నైట్ చిత్రం నిర్మించబడింది. తమిళ్ రచయిత, దర్శకుడు జీఆర్ ఆదిత్య ఈ చిత్రాన్ని ఆద్యంతం అద్భుతంగా ఊహించని ట్విస్ట్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే విధంగా మలిచాడు. నాలుగు ప్రధాన పాత్రల మధ్య సంక్లిష్టంగా అల్లిన భావోద్వేగాలతో ఉత్కంఠభరితమైన కథనాన్ని అందించారు" అని నిర్మాత చెప్పుకొచ్చారు.

ఎమోషనల్ రోలర్ కోస్టర్

"అన్ని విదాల ఎమోషనల్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తుంది డార్క్ నైట్ చిత్రం. చివరి వరకు వారిని వారి సీట్లకు అతుక్కునే విధంగా సన్నివేశాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్లింగ్‌గా ఎమోషనల్ రోలర్‌ కోస్టర్‌లో రన్ అవుతున్న ఫీలింగ్ కలిగిస్తుంది" అని నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి పేర్కొన్నారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం