బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు.
భైరవం చిత్రంలో హీరోయిన్స్‌గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై నటించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. భైరవం ఈ సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
-కథ కమర్షియల్‌గా నాకు చాలా నచ్చింది. అలాగే ముగ్గురు హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఓకే చేశాను. ఒరిజినల్‌లో ఉన్న ఆర్గానిక్ ఎమోషన్ ఇందులో ఉంటుంది. క్యారెక్టరైజేషన్ ప్రజెంటేషన్ నా స్టైల్‌లో ఉంటుంది. తెలుగు సినిమాకి కావాల్సిన కమర్షియల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి.
-ఒరిజినల్ చూసిన వారు కూడా డెఫినెట్‌గా కొత్తగా ఉందని ఫీల్ అవుతారు. ఒరిజినల్ కంటే ఇది బావుందనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఆడియన్స్ థ్రిల్ ఫీలౌతారు.
-ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు సాయి గారిని ఫైనల్ చేసుకున్నాం. తర్వాత రోహిత్ గారిని మనోజ్ గారిని కలిసాం. ఇద్దరు ఓకే చెప్పారు. మనోజ్ గారు రోహిత్ గారు చాలా మంచి పర్ఫార్మర్స్. అలాగే వాళ్లు (హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్) స్క్రీన్ మీదకి వచ్చి కూడా కొంత గ్యాప్ వచ్చింది.
-ఒక మంచి యాక్టర్స్ నుంచి మంచి సినిమా వచ్చినప్పుడు డెఫినెట్‌గా ఆడియన్స్ థియేటర్‌కి వస్తారని నమ్మకం ఉంది. ఒరిజినల్‌లో ఉన్న కాన్‌ఫ్లిక్ట్ ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అలాగే తెలుగు ఆడియన్స్‌కి కావలసిన ఎమోషన్స్ ఉంటాయి.
-శ్రీ చరణ్‌తో నాకు ఇది రెండో సినిమా. తన పర్‌ఫెక్ట్‌గా మ్యూజిక్ చేశాడు. చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన మూడు పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. మరో సాంగ్ 21న రిలీజ్ చేస్తున్నాం. చాలా కమర్షియల్‌గా ఉంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా చేసాడు. రెగ్యులర్ సౌండ్ కాకుండా కొత్తగా ట్రై చేసాడు.
సంబంధిత కథనం