తెలుగులో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొంత తక్కువే. అందులోనూ స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా అరుదు. రేర్ కాంబోలో త్వరలో తెలుగులో ఓ మూవీ రాబోతోంది. ఇద్దరు టాలీవుడ్ టాప్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీకి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడు.
భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ సోషియా ఫాంటసీ మూవీ తెరకెక్కతోన్నట్లు సమాచారం. ఈ సినిమాను హనుమాన్ సినిమా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మించబోతున్నట్లు తెలిసింది.
ఇప్పటివరకు తాను చేసిన సినిమాలకు భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను ఎంచుకొని డైరెక్టర్ వీఐ ఆనంద్ ఈ మూవీ తెరకెక్కిస్తోన్నట్లు తెలిసింది.
ఈ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ మూవీలో నటించనున్న టాప్ హీరోలు ఎవరన్నది త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం. ఇద్దరు స్టార్ హీరోలతో దర్శకనిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీఐ ఆనంద్ చెప్పిన కథ కూడా హీరోలకు నచ్చినట్లు సమాచారం.
టైగర్ మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వీఐ ఆనంద్. నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. వీఐ ఆనంద్ రూపొందించిన ఒక్క క్షణం, డిస్కోరాజాతో డిఫరెంట్ అటెంప్ట్‌లుగా ఆడియెన్స్‌ను మెప్పించాయి.
గత ఏడాది సందీప్‌కిషన్‌తో ఊరు పేరు భైరవకోన సినిమా చేశాడు వీఐ ఆనంద్. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది.
హనుమాన్ మూవీతో ప్రొడ్యూసర్‌గా పెద్ద విజయాన్ని అందుకున్నాడు నిరంజన్ రెడ్డి. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ తర్వాత సాయిధరమ్‌తేజ్‌తో సంబరాల ఏటిగట్టు మూవీని తెరకెక్కిస్తోన్నాడు నిరంజన్ రెడ్డి. దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. సంబరాల ఏటిగట్టు తర్వాత వీఐ ఆనంద్ సోషియో ఫాంటసీ మూవీ మొదలుకానున్నట్లు సమాచారం.
సంబంధిత కథనం