Venu Udugula: క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు.. విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల కామెంట్స్-director venu udugula comments on raju weds rambai climax in movie title announcement launch ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Venu Udugula: క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు.. విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల కామెంట్స్

Venu Udugula: క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు.. విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 20, 2024 11:23 AM IST

Director Venu Udugula About Raju Weds Rambai Climax: విరాట పర్వం, నీది నాది ఒకే కథ వంటి సినిమాలతో అలరించిన డైరెక్టర్ వేణు ఊడుగుల నిర్మాతగా మారిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి. తాజాగా రాజు వెడ్స్ రాంబాయి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వేణు ఊడుగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు.. విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల కామెంట్స్
క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు.. విరాట పర్వం డైరెక్టర్ వేణు ఊడుగుల కామెంట్స్

Venu Udugula Raju On Weds Rambai Climax: 'నీది నాది ఒకే కథ', 'విరాట పర్వం' వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల నిర్మాతగా మారారు. తాజాగా తన తొలి నిర్మాణ సంస్థను అనౌన్స్ చేశారు. రాహుల్ మోపిదేవితో కలిసి డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్‌పై సినిమాని నిర్మిస్తున్నారు వేణు ఊడుగుల.

రాజు వెడ్స్ రాంబాయి టైటిల్ అనౌన్స్

వేణు ఊడుగుల నిర్మిస్తున్న ఈ సినిమాతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి మేకర్స్ 'రాజు వెడ్స్ రాంబాయి' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఖమ్మం, వరంగల్ బోర్డర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా యదార్థ కథ ఆధారంగా తెరకెక్కింది.

శాశ్వతమైన ముద్ర

నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిన మూవీస్ ఎల్లప్పుడూ ప్రేక్షకులలో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తిస్తాయన్న విషయం తెలిసిందే. అలాగే, రాజు వెడ్స్ రాంబాయి మూవీ కూడా శాశ్వతమైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉందని మేకర్స్ చెబుతున్నారు. రాజు వెడ్స్ రాంబాయి టైటిల్ పోస్టర్‌లో హీరో డ్రమ్ వాయిస్తూ ఉండగా అతని పక్కన తన ప్రేమికురాలిని ప్రజెంట్ చేస్తోంది.

తీన్‌ మార్- దోమార్

టైటిల్ గ్లింప్స్ అమ్మాయి ఈ డ్రమ్మర్‌తో ప్రేమలో పడిన యెనగంటి రాంబాయిగా తనను తాను పరిచయం చేసుకుంది. హీరో డ్రమ్స్ వాయించే విధానాన్ని రాంబాయి ఇష్టపడుతున్నట్లుగా చూపించారు. యెల్లందులోని బొగ్గు గనుల వంటి గ్రామంలో తన ప్రేమకథ పాపులర్ అని ఆమె చెబుతుంది. ఆమె తమ ప్రేమకథను తీన్‌ మార్, దో మార్, నాగిని అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.

ప్రేమికుల దినోత్సవం రోజున

టైటిల్ గ్లింప్స్ ప్రకారం రాజు వెడ్స్ రాంబాయి తెలంగాణ నేపథ్యంలో సాగే అందమైన గ్రామీణ ప్రేమకథ అని తెలుస్తోంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమాను ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14, 2025న విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన తారాగణం, ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. రాజు వెడ్స్ రాంబాయి టైటిల్ గ్లింప్స్ లాంచ్ ప్రెస్ మీట్‌లో నిర్మాత వేణు ఊడుగుల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సంఘర్షణ అట్రాక్ట్ చేసింది

"సాయిలు నాతో మూడేళ్లుగా ట్రావెల్ చేస్తున్నాడు. ఒకరోజు వాళ్ల ప్రాంతంలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని ఒక కథ రాశానని చెప్పాడు. ఆ కథ విన్న తర్వాత నాకు ఒక ఎక్స్‌ట్రార్డనరీ ఫీలింగ్ కలిగింది. ఎగ్జైట్‌మెంట్ వచ్చింది. కథలో ఉన్న ఇన్నోసెన్స్, కథ జరిగే ప్రాంతం, పాత్రలు, ఆ పాత్రల మధ్య సంఘర్షణ అన్ని నన్ను బాగా ఎట్రాక్ట్ చేశాయి" అని వేణు ఊడుగుల తెలిపారు.

ఈటీవీ విన్ ఓటీటీతో

"క్లైమాక్స్ మూడు రోజులపాటు నిద్రపోనివ్వలేదు. ఇంత వైవిధ్యమైనటువంటి ప్రేమ కథని నేనెప్పుడూ చూడలేదు వినలేదు. ఈ కథని సినిమాగా తీయాలని స్ట్రాంగ్ ఇంటెన్షన్‌తో ఈటీవీ విన్ వాళ్లతో షేర్ చేయడం జరిగింది. వాళ్లు కూడా కథ విని హ్యాపీగా ఫీలయ్యారు. ఈ కొలాబరేషన్‌తో మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు టైటిల్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశాం. ఇది మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా వుంది" అని వేణు ఊడుగుల వెల్లడించారు.

Whats_app_banner