Telugu OTT: టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించిన గాంధీ తాత చెట్టు ఓటీటీలో అదరగొడుతోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈమూవీ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా కొనసాగుతోంది. సమాజానికి ఉపయుక్తమైన మంచి సినిమాగా ఓటీటీలోనూ ప్రశంసలను అందుకుంటోంది.
గాంధీ తాత చెట్టు సినిమాలో సుకృతి వేణితో పాటు ఆనందచక్రపాణి, రాగ్‌మయూర్ కీలక పాత్రల్లో నటించారు. పద్మావతి మల్లాది ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై సుకుమార్ సతీమణి తబిత ఈ సినిమాను నిర్మించింది.
మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన గాంధీతాత చెట్టు జనవరి నెలాఖరున థియేటర్లలో రిలీజైంది. సుకృతివేణి యాక్టింగ్‌తో పాటు కాన్సెప్ట్ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఈ మూవీతోనే సుకృతి వేణి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాలోనే తన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్‌తో ఆకట్టుకున్నది.
గాంధేయవాది అయినరామచంద్రయ్య(ఆనంద చక్రపాణి) తన మనవరాలికి గాంధీ (సుకృతి వేణి) అనే పేరు పెడతాడు. రామచంద్రయ్య తనకున్న పదెకరాల పొలంలో ఓ వేపచెట్టు నాటుతాడు. ఆ చెట్టుపై అభిమానాన్నిపెంచుకుంటాడు. తన కష్టాలను సుఖాలను చెట్టుతోనే పంచుకుంటాడు.రామచంద్రయ్య భూమిపై ఓ కార్పొరేట్ కంపెనీ ప్రతినిధి సురేష్ (రాగ్ మయూర్)కన్నేస్తాడు.
అతడికి తన భూమిని అమ్మడానికి రామచంద్రయ్య ఒప్పుకోడు. ఆ తర్వాత ఏమైంది? రామచంద్రయ్య ఎలా చనిపోయాడు? తాత ప్రాణంగా పెంచుకున్న చెట్టును గాంధీ ఎలా కాపాడింది? ఊళ్లోని భూములను కాపాడేందుకు గాంధీ ఎలాంటి పోరాటం చేసింది అన్నదే ఈ మూవీ కథ. ఈ సినిమాకు తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ అందించాడు.
రిలీజ్‌కు ముందే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఈ సినిమా స్క్రీనింగ్ అయ్యింది. సుకృతవేణికి అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు రీ మ్యూజిక్ అందించాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రీమియర్‌లో సుకృతవేణిని చూసి ఈ సినిమా కోసం సెలెక్ట్ చేసినట్లు ప్రమోషన్స్‌లో డైరెక్టర్ పద్మావతి చెప్పింది.
సంబంధిత కథనం