Om Bheem Bush: యూనివర్సిటీల్లో 30 ఏళ్లు దాటినా చదువుతారు.. తర్వాత ఏం చేస్తారనేదే కథ: డైరెక్టర్-director sree harsha konuganti about om bheem bush story om bheem bush trailer release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Director Sree Harsha Konuganti About Om Bheem Bush Story Om Bheem Bush Trailer Release Date Announced

Om Bheem Bush: యూనివర్సిటీల్లో 30 ఏళ్లు దాటినా చదువుతారు.. తర్వాత ఏం చేస్తారనేదే కథ: డైరెక్టర్

Sanjiv Kumar HT Telugu
Mar 14, 2024 03:40 PM IST

Harsha Konuganti About Om Bheem Bush: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి నవ్వేంచుదుకు సిద్ధమైన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమా గురించి డైరెక్టర్ హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే తాజాగా ఓం భీమ్ బుష్ ట్రైలర్ విడుదల తేది ప్రకటించారు.

యూనివర్సిటీల్లో 30 ఏళ్లు దాటినా చదువుతారు.. తర్వాత ఏం చేస్తారనేదే కథ: డైరెక్టర్
యూనివర్సిటీల్లో 30 ఏళ్లు దాటినా చదువుతారు.. తర్వాత ఏం చేస్తారనేదే కథ: డైరెక్టర్

Om Bheem Bush Trailer Release Date: హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాకు 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండగా, యువి క్రియేషన్స్ సమర్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ విడుదల తేదిని ప్రకటించారు.

మార్చి 15వ తేదిన సాయంత్రం 4 గంటల 59 నిమిషాలకు అంటే 5 గంటలకు ఓం భీమ్ బుష్ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నట్లు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. అలాగే సినిమాను మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఓం భీమ్ బుష్‌కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు చెప్పారు.

గుప్తనిధుల అన్వేషణ ఎలా ఉంటుంది ? అసలు 'ఓం భీమ్ బుష్' అంటే ఏమిటి ?

ఒకప్పుడు బ్యాంకులు లేనప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు, బంగారం ఒక బిందెలో పెట్టి భూమిలో దాచేవారు. ఈ కథలో యూనిర్సిటీలో చదువుకున్న ముగ్గురు ఓ గ్రామంలో అలాంటి గుప్త నిధుల కోసం చేసిన అన్వేషణ ఎలా జరిగిందనేది చాలా క్రేజీగా చూపించడం జరిగింది. 'ఓం భీమ్ బుష్' అనేది ఓ మ్యాజికల్ ఫ్రేజ్. చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు కూడా సరదాగా ఆ మాట వాడుతుంటారు. ఈ కథలో కూడా చాలా మ్యాజిక్ ఉంటుంది. పారానార్మల్ యాక్టివిటీస్, ఆత్మలు, లంకె బిందెలు ఇలాంటి మిస్టీరియస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ కథకు 'ఓం భీమ్ బుష్' అనేది యాప్ట్ టైటిల్.

మీ కథ సినిమాల్లో స్టూడెంట్, కాలేజీ నేపథ్యంలో ఉంటాయి. ఇందులో ఎలా ఉండబోతుంది?

'ఓం భీమ్ బుష్'లో కూడా కొంచెం స్టూడెంట్ ఎపిసోడ్ ఉంటుంది. పెద్ద యూనిర్సిటీలలో 30 ఏళ్లు దాటిన వారు కూడా ఏదో పీహెచ్‌డీ చేస్తూ అక్కడే ఉంటారు. ఇందులో ముగ్గురు కూడా అలా యూనివర్సిటీలో రిలాక్స్‌గా ఉండేవారే. అలాంటి ముగ్గురు బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది కథ.

నో లాజిక్ అంటున్నారు. ఈ కథలో లాజిక్ ఉండదా?

ఈ కథలో చాలా లాజిక్ ఉంటుంది. ప్రతి సన్నివేశం లాజిక్‌తో ముడిపడి ఉంటుంది. ఇందులో చాలా బలమైన కథ ఉంది. కానీ, ఇప్పుడు రివిల్ చేయడం లేదు. ఈ సినిమాకి కథే హైలెట్. ఇందులో మంచి ఎమోషన్ కూడా ఉంది. అది చాలా కొత్తగా ఉంటుంది. ఆ కొత్త పాయింటే సినిమాకి యూఎస్పీ. ఇలాంటి పాయింట్ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకూ రాలేదు. ఏ భాషలో చూసిన నచ్చుతుంది. ఇందులో హ్యూమన్ ఎమోషన్ కూడా ఆకట్టుకుంటుంది. చాలా క్లీన్ సినిమా ఇది. పిల్లలతో కలసి హాయిగా చూడొచ్చు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురిని ద్రుష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను. ఇందులో వారి పాత్రలు చాలా హిలేరియస్‌గా ఉంటాయి. ఫిక్షన్‌తో పాటు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ కథని చేశాం.

శ్రీ విష్ణు సామజవరగమన ప్రేక్షకులని చాలా నవ్వించింది. ఈ చిత్రం ఎలా ఉంటుంది?

సామజవరగమనకు నవ్వారంటే దానికి పదిరెట్లు ఈ చిత్రానికి నవ్వుతారు. ఇందులో శ్రీ విష్ణు విశ్వరూపం చూస్తారు. కామిక్ టైమింగ్‌లో నెక్ట్స్ లెవల్ ఉంటుంది. ఇంత ఫుల్ లెంత్ కామెడీ ఆయన ఇప్పటి వరకూ చేయలేదు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పాత్రలని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మొదటి షాట్ నుంచి చివరి వరకూ ఓ లాఫ్ రైడ్‌గా ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు.

IPL_Entry_Point