Kanguva Bobby Deol: ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూసి యానిమల్ నటుడిని కంగువలో విలన్‌గా తీసుకున్నాం - డైరెక్టర్ కామెంట్స్
Kanguva Bobby Deol: బాబీ డియోల్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూసి కంగువ మూవీలో అతడిని విలన్‌గా తీసుకున్నట్లు డైరెక్టర్ శివ చెప్పాడు. ఈ సినిమాలో సూర్యకు ధీటుగా బాబీడియోల్ విలన్ క్యారెక్టర్ సాగుతుందని శివ అన్నాడు. కంగువ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో నవంబర్ 14న రిలీజ్ కాబోతోంది.
సూర్య కంగువ మూవీ వరల్డ్ వైడ్‌గా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో వెయ్యేళ్ల క్రితం నాటి పోరాట యోధుడు కంగువగా...ఫ్రాన్సిస్‌గా డ్యూయల్ రోల్‌లో సూర్య కనిపించబోతున్నాడు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా నటించాడు. ఉధిరన్ అనే క్యారెక్టర్‌లో సూర్యకు ధీటుగా బాబీ డియోల్ విలన్ క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. కంగువ మూవీతోనే నటుడిగా బాబీ డియోల్ కోలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
సౌత్ ఫేమస్ యాక్టర్స్...
తొలుత కంగువలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్‌తో పాటు సౌత్ ఫేమస్ యాక్టర్స్ చాలా మంది పేర్లను టీమ్ అనుకున్నారట. అందులో కొందరు స్టార్ హీరోలు కూడా ఉన్నట్లు సమాచారం. కానీ వారందనిని కాదని బాబీడియోల్‌ను సెలెక్ట్ చేయడానికి ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియో కారణమని డైరెక్టర్ శివ అన్నాడు.
బాబీ డియోల్ స్వాగ్...
బాబీడియోల్ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో చూశా. అందులో కారు దిగి ఎయిర్‌పోర్ట్‌లోపలికి బాబీడియోల్ అడుగుపెట్టాడు. ఆ వీడియోలో ఆయన స్వాగ్,స్టైల్ తనను ఎంతగానే ఆకట్టుకున్నాయని శివ అన్నాడు. బాబీ డియోల్‌ను కంగువ సినిమాలో విలన్‌గా తీసుకుంటే బాగుంటుందని వీడియో చూడగానే అనిపించింది. అదే విషయం సూర్యకు చెబితే ఆయన ఓకే అన్నారు. కంగువ కథ వినగానే బాబీ డియోల్ కూడి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారని శివ చెప్పాడు.
గుప్త్, సోల్టర్ మూవీ....
బాబీడియోల్ నటనకు తాను పెద్ద అభిమానినని, ఆయన గుప్త్, సోల్జర్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని శివ చెప్పాడు. కంగువ మూవీలో ఉధిరన్ పాత్రలో బాబీడియోల్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ అదిరిపోతాయని, బాబీ డియోల్ ఒప్పుకున్న తర్వాతే సినిమాలో విలన్ క్యారెక్టర్‌కు మరింత వాల్యూ పెరిగిందంటూ ప్రశంసలు కురిపించాడు శివ.
350 కోట్ల బడ్జెట్...
కంగువ మూవీని దాదాపు 350 కోట్లతో కేఈ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
పవన్ కళ్యాణ్ మూవీలో...
యానిమల్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన బాబీ డియోల్ ప్రస్తుతం విలన్ పాత్రలతో బిజీ అయ్యాడు. దక్షిణాదిలో బాబీ డియోల్‌కు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. తెలుగులో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లతో సినిమాలు చేస్తోన్నాడు. పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాలో మొఘల్ రాజు ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తోన్నాడు. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కాబోతోంది.
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీలో బాబీడియోల్ విలన్‌గా నటిస్తోన్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ మూవీకి టైటిల్‌ను నవంబర్ 15న మేకర్స్ రివీల్ చేయబోతున్నారు.