Kajal in Indian 2: అప్పుడు ఆచార్య - ఇప్పుడు ఇండియ‌న్ 2 - లాస్ట్ మిన‌ట్‌లో కాజ‌ల్‌కు షాకిస్తోన్న డైరెక్ట‌ర్లు-director shankar clarity on kajal aggarwal role in bharateeyudu 2 kamal haasan india 2 release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal In Indian 2: అప్పుడు ఆచార్య - ఇప్పుడు ఇండియ‌న్ 2 - లాస్ట్ మిన‌ట్‌లో కాజ‌ల్‌కు షాకిస్తోన్న డైరెక్ట‌ర్లు

Kajal in Indian 2: అప్పుడు ఆచార్య - ఇప్పుడు ఇండియ‌న్ 2 - లాస్ట్ మిన‌ట్‌లో కాజ‌ల్‌కు షాకిస్తోన్న డైరెక్ట‌ర్లు

Nelki Naresh Kumar HT Telugu
Jul 08, 2024 09:39 AM IST

Kajal in Indian 2: భార‌తీయుడు 2 రిలీజ్‌కు ముందు సినిమాలో కాజ‌ల్ క్యారెక్ట‌ర్‌పై శంక‌ర్ మ‌రోసారి క్లారిటీ ఇచ్చాడు. సీక్వెల్‌లో కాజ‌ల్ క‌నిపించ‌ద‌ని, పార్ట్ 3లో మాత్ర‌మే ఉంటుంద‌ని వెల్ల‌డించాడు.

కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్

Kajal in Indian 2: ఇండియ‌న్ 2 రిలీజ్‌కు ముందు కాజ‌ల్ అగ‌ర్వాల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ షాకిచ్చాడు. ఈ సీక్వెల్‌లో కాజ‌ల్ క్యారెక్ట‌ర్ క‌నిపించ‌ద‌ని తెలుగు ప్ర‌మోష‌న్స్‌లో వెల్ల‌డించాడు. ఇండియ‌న్ 2లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను మెయిన్ హీరోయిన్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తీసుకున్నాడు శంక‌ర్‌.

ఇండియ‌న్ 2 లో త‌న రోల్ కోసం గుర్ర‌పుస్వారీ, మార్ష‌ల్ ఆర్ట్స్‌లో కాజ‌ల్‌ ట్రైనింగ్ తీసుకున్న‌ది. చాలా రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ చేసింది. ఇండియ‌న్ 2 త‌మిళ ప్ర‌మోష‌న్స్‌లో కాజ‌ల్ సంద‌డి చేయ‌డంతో ఆమె ఈ సినిమాలో క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు భావించారు. కానీ కాజ‌ల్ ఈ సినిమాలో అస‌లు క‌నిపించ‌ద‌ని చెప్పి శంక‌ర్ ట్విస్ట్ ఇచ్చాడు.

పార్ట్ 3లో మాత్ర‌మే...

ఆదివారం భార‌తీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో శంక‌ర్ మాట్లాడుతూ కాజ‌ల్ క్యారెక్ట‌ర్ ఇండియ‌న్ 2లో ఉండ‌ద‌ని, పార్ట్ 3లో ఆమె క‌నిపిస్తుంద‌ని తెలిపాడు.

ఇండియ‌న్ 2 కోసం కాజ‌ల్‌పై షూట్ చేసిన సీన్స్ మొత్తం పార్ట్ 3లో క‌నిపించేలా శంక‌ర్ స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేశాడ‌ని అంటున్నారు. ఆ ఛేంజెస్‌లో భాగంగానే కాజ‌ల్ క్యారెక్ట‌ర్ సీక్వెల్‌లో క‌నిపించ‌కుండాపోయింద‌ని చెబుతోన్నారు. పార్ట్ 2లో త‌న క్యారెక్ట‌ర్ లేద‌నే నిజం ముందుగానే తెలియ‌డంతో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు కాజ‌ల్ దూరంగా ఉంటుంద‌ని అంటున్నారు.

అప్పుడు ఆచార్య‌...ఇప్పుడు ఇండియ‌న్ 2...

గ‌తంలో ఆచార్య సినిమాలో ఇలాగే జ‌రిగింది. చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టించిన ఈ మూవీలో కాజ‌ల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. చిరంజీవి, కాజ‌ల్ కాంబినేష‌న్‌లో చాలా సీన్స్ షూట్ చేశారు. రామ్ చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ నిడివి పెంచి, క‌థ‌ను మ‌రింత క‌మ‌ర్షియ‌లైజ్ చేయ‌డానికి రిలీజ్‌కు కొద్ది రోజుల‌ ముందు కాజ‌ల్ క్యారెక్ట‌ర్ మొత్తాన్ని సినిమా నుంచి తొల‌గించారు.

ఇండియ‌న్ 3 రిలీజ్ ఎప్పుడంటే?

అదే సీన్ ఆచార్య సీన్ ఇండియ‌న్ 2లో రిపీటైంద‌ని, కాజ‌ల్ ఈ మూవీలో హీరోయిన్ అంటూ ఇన్నాళ్లు ప్ర‌చారం చేసి ఇప్పుడు సినిమాలో ఆమె ఉండ‌ద‌ని చెప్ప‌డం బాగా లేద‌ని ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతోన్నారు.

ఇండియ‌న్ 2కు కొన‌సాగింపుగా ఇండియ‌న్ 3ని తెర‌కెక్కించ‌బోతున్నారు క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్‌. ఈ మూడో పార్ట్ వ‌చ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే పార్ట్ 3కి సంబంధించి యాభై శాతం వ‌ర‌కు షూటింగ్ పూర్త‌యిన‌ట్లు స‌మాచారం.

ప్ర‌పంచంలో ఎవ‌రూ లేరు...

భార‌తీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శంకర్ మాట్లాడుతూ.. ‘2.ఓ టైమ్‌లో ఇండియ‌న్ 2 స్టోరీ సెట్ అయింది. ఆ కథను క‌మ‌ల్‌హాస‌న్‌కు కూడా బాగా నచ్చింది. భారతీయుడు 2 సినిమా సెట్‌లో సేనాపతిగా కమల్ హాసన్ చూసిన ప్ర‌తిసారి నాకు గూస్‌బంప్స్ వ‌చ్చేవి. ఆడియెన్స్‌కి కూడా థియేట‌ర్ల‌లో అలాంటి ఫీలింగే వస్తుంది.

నేను రాసిన దాని కంటే.. ఆయన నటించిన తరువాత ప్ర‌తి సీన్ స్థాయి పదింతలు పెరిగింది.అలాంటి నటులు దొరకడం అదృష్టం. రోప్‌ మీద ప్రోస్థటిక్ మేకప్‌తో నాలుగు రోజులు షూట్ చేశాం. క‌మ‌ల్‌హాస‌న్‌లా న‌టించే యాక్ట‌ర్ ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ లేరు. సిద్దార్థ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. రకుల్ ప్రతీ సీన్‌ను తెలుసుకుని, అర్థం చేసుకుని నటించింది. ఇండియ‌న్ 2తో పాటు గేమ్ ఛేంజ‌ర్‌లోనూ చిన్న అతిథి పాత్ర‌లో బ్ర‌హ్మానందం క‌నిపిస్తారు" అని శంక‌ర్ అన్నాడు...

గేమ్ ఛేంజ‌ర్ అప్‌డేట్‌...

“ఇప్ప‌టివరకు నేను తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. ఏ ఎం రత్నం వల్లే నా సినిమాలన్నీ ఇక్కడకు వచ్చాయి తెలుగులో ఆడియెన్స్ కోసం ఒక తెలుగు సినిమాను చేయాలని నా క‌ల గేమ్ ఛేంజ‌ర్‌తో తీర‌నుంది. గేమ్ ఛేంజ‌ర్‌కు సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ అయిపోయింది. రామ్ చరణ్‌ది ఎక్స్‌లెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయనలో ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా? అని అనిపిస్తుంది. గేమ్ చేంజర్ సినిమా చూస్తే మీకు అది తెలుస్తుంది” అని శంకర్ అన్నాడు.

భార‌తీయుడు 2 మూవీ జూలై 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌తో పాటు సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ఎస్‌జే సూర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈసినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు.

WhatsApp channel