Passion Movie: హ్యాపీడేస్ మూవీలా 'పాషన్' ఉంటుంది.. శేఖర్ కమ్ముల కామెంట్స్-director sekhar kammula comments on passion movie on launching ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Passion Movie: హ్యాపీడేస్ మూవీలా 'పాషన్' ఉంటుంది.. శేఖర్ కమ్ముల కామెంట్స్

Passion Movie: హ్యాపీడేస్ మూవీలా 'పాషన్' ఉంటుంది.. శేఖర్ కమ్ముల కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Dec 22, 2023 01:27 PM IST

Sekhar Kammula About Passion Movie: హ్యాపీడేస్ మూవీలాగే పాషన్ సినిమా ఉంటుందని డైరెక్టర్ శేఖర్ కమ్ములు ఇటీవల ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

హ్యాపీడేస్ మూవీలా 'పాషన్' ఉంటుంది.. శేఖర్ కమ్ముల కామెంట్స్
హ్యాపీడేస్ మూవీలా 'పాషన్' ఉంటుంది.. శేఖర్ కమ్ముల కామెంట్స్

సుధీష్ వెంకట్, అంకిత సాహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "పాషన్". ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ నేపథ్యంగా సాగే ప్రేమ కథా చిత్రమిది. ఈ సినిమాను తోలు బొమ్మలాట ఫిల్మ్స్ బ్యానర్ పై డాక్టర్ అరుణ్ మొండితోక, నరసింహ, ఏ పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. "పాషన్" చిత్రంతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జోషువా దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు.

అరవింద్ జోషవా ఇంతకుముందు పాపులర్ డైరెక్టర్స్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula), మదన్, మోహన కృష్ణ ఇంద్రగంటి వంటి వారి వద్ద పనిచేశారు. ఇటీవల హైదరాబాద్ లో "పాషన్" సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నిచ్చారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మొండితోక కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. దర్శకుడు వేణు ఊడుగుల గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత పద్మనాభ రెడ్డి స్క్రిప్ట్ ను దర్శకుడు అరవింద్ జోషువాకు అందజేశారు.

"ఈ స్టోరీ రాయడం, దాన్ని నవలగా ప్రచురించడం, సినిమా తీసే ప్రయత్నం.. నాకు అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు అరవింద్. ఇది చాలా మంచి కథ. నేను అంతా కొత్తవాళ్లతో తీసిన హ్యాపీడేస్‌లా పాషన్ కూడా యూత్ ని ఆకట్టుకుని, ఇన్ స్పైర్ చేసే మంచి సినిమా అవుతుందని నమ్ముతున్నాను" అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలిపారు.

"ఎక్కడా కాంప్రమైస్ కాకుండా కేవలం కథని, దాన్ని హానెస్ట్ గా సినిమాగా తీయడాన్నే నమ్మిన డైరెక్టర్ అరవింద్. అదే సినిమాకి బలమని నమ్ముతున్నాం. త్వరలోనే మా సినిమాను రెగ్యులర్ షూటింగ్ కు తీసుకెళ్తాం" అని నిర్మాత అరుణ్ మొండితోక అన్నారు.

"సినిమా ఫలితం ఎలా ఉంటుందనే ఆలోచన లేకుండా కేవలం కథను నమ్మి మా ప్రొడ్యూసర్స్ అరుణ్, పద్మనాభ రెడ్డి గార్లు సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. వారికి నా థ్యాంక్స్ చెబుతున్నా. మేము అనుకున్న సబ్జెక్ట్ ను నిజాయితీగా తెరకెక్కించాలని ప్రయత్నం చేస్తున్నాం. మా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి బ్లెస్ చేసిన మా గురువు శేఖర్ కమ్ముల గారికి కృతజ్ఞతలు చెబుతున్నా" అని మూవీ డైరెక్టర్ అరవింద్ జోషవా తెలిపారు.

Whats_app_banner