మనం, ఊపిరి లాగే ఇందులో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారు.. అది పదింతలు కనిపిస్తుంది.. దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్-director sekhar kammula about nagarjuna role in kuberaa movie and says rashmika mandanna will surprise audience ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మనం, ఊపిరి లాగే ఇందులో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారు.. అది పదింతలు కనిపిస్తుంది.. దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

మనం, ఊపిరి లాగే ఇందులో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారు.. అది పదింతలు కనిపిస్తుంది.. దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

మనం, ఊపిరి సినిమాల్లో లాగానే టాలీవుడ్ కింగ్ నాగార్జునను కుబేర మూవీ చాలా కొత్తగా చూస్తారని డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలిపారు. నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నాలతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమా కుబేర. ఈ మూవీ రిలీజ్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు శేఖర్ కమ్ముల.

మనం, ఊపిరి లాగే ఇందులో నాగార్జున చాలా కొత్తగా కనిపిస్తారు.. అది పదింతలు కనిపిస్తుంది.. దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ వంటి అగ్ర తారలు తొలిసారిగా కలిసి నటించిన సినిమా కుబేర. పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర జూన్ 20న థియేటర్లలో గ్రాండ్‌గా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఈ కథకు నాగర్జున గారే కావాలని మీరు పట్టుపట్టారని తెలిసింది?

- కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున గారు చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కి ఆయన పర్‌ఫెక్ట్ యాప్ట్. ఆయనని స్క్రీన్ మీద చూసినప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అయితే ఇందులో ఆయన్ని ఒక వేరే విధమైన యాక్టింగ్, మేనేజర్స్‌తో క్యారెక్టర్‌కి తగ్గట్టుగా చూపించడం జరిగింది.

-నాగార్జున గారు మనం, ఊపిరి ఇలా చాలా చిత్రాల్లో డిఫరెంట్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమాలో కూడా అలాగే ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ క్యారెక్టర్‌లోకి ఆయన అద్భుతంగా ఇమిడిపోయారు. రష్మిక కూడా అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. తనకి మంచి అవకాశం వస్తే నెక్ట్స్ లెవెల్‌లో నటించే హీరోయిన్ తను.

కుబేర కూడా మీ మార్క్‌లోనే ఉంటుందా?

-నిజానికి నా మీద ఒక మార్క్ పడింది. కానీ, నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. కథకు ఏం కావాలో అదే చేశాను. అయితే ఎక్కువగా బ్లాక్ బస్టర్ ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్, లవ్ స్టోరీలు ఉన్నాయి కాబట్టి అలా ఒక ముద్ర వచ్చింది.

-లీడర్ సినిమా చాలా హానెస్ట్‌గా చెప్పిన కథ. అందులో లవ్ స్టోరీ పెట్టాలి, మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు. హ్యాపీ డేస్‌లో కూడా అంతే. కాలేజ్ స్టోరీ అంటే అలాగే ట్రీట్ చేయడం జరిగింది. అందుకే మీకు నచ్చింది. కుబేర కూడా అంతే. ఈ కథకు కావలసింది చేశాను. మార్క్ అనేది కథ ప్రకారం ఉంటుంది.

ఇలా చేశారా అనే

-అయితే ఇలాంటి కథని ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ కుబేర చూసినప్పుడు ఆడియన్స్‌లో ఉంటుంది. అందుకే ముందుగానే ఈ కంటెంట్ ఏంటనేది ట్రైలర్ టీజర్‌లో క్లియర్‌గా చెప్పాము. రిచ్, పూర్ మధ్య జరిగే కథని ముందుగానే ఎస్టాబ్లిష్ చేశాం. ఇది ఒక డిఫరెంట్ సినిమా. నేను ఏ సినిమా తీసిన హానెస్ట్‌గానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం