ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సునీల్.. ప్రభాస్ దర్శకత్వం.. డైరెక్టర్ సంపత్ నంది రిలీజ్ చేసిన ఫైటర్ శివ ఫస్ట్ లుక్-director sampath nandi released fighter shiva first look comedian sunil plays investigation officer role ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సునీల్.. ప్రభాస్ దర్శకత్వం.. డైరెక్టర్ సంపత్ నంది రిలీజ్ చేసిన ఫైటర్ శివ ఫస్ట్ లుక్

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సునీల్.. ప్రభాస్ దర్శకత్వం.. డైరెక్టర్ సంపత్ నంది రిలీజ్ చేసిన ఫైటర్ శివ ఫస్ట్ లుక్

Sanjiv Kumar HT Telugu

డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా ఫైటర్ శివ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఫైటర్ శివ సినిమాలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సునీల్ నటిస్తున్నాడు. ప్రభాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..!

ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా సునీల్.. ప్రభాస్ దర్శకత్వం.. డైరెక్టర్ సంపత్ నంది రిలీజ్ చేసిన ఫైటర్ శివ ఫస్ట్ లుక్

అరుణగిరి ఆర్ట్స్, కౌండిన్య ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఫైటర్ శివ. ఈ ఫైటర్ శివ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది. దీంతో ఫైటర్ శివ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా మొదలుపెట్టారు మేకర్స్.

గన్స్ మధ్యలో

ఈ క్రమంలోనే ఫైటర్ శివ ఫస్ట్ లుక్‌ను డైరెక్టర్ సంపత్ నంది చేతుల మీదుగా విడుదల చేశారు. చుట్టూ గన్స్, ఆ గన్స్ మధ్యలో గ్యాంగ్‌స్టర్స్, పోలీసులు, ఇతర వ్యక్తులు ఉంటూ ఇంటెన్సివ్‌గా ఉంది. రక్తాన్ని మైమరిపించేలా రెడ్ కలర్‌లో ఫైటర్ శివ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డిజైన్ చేశారు.

ఐరా బన్సాల్ హీరోయిన్

ఇకపోతే ఫైటర్ శివ సినిమాకు ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మణికంఠ కథానాయకుడుగా, ఐరా బన్సాల్ హీరోయిన్‌గా నటించారు. అలాగే ఫైటర్ శివ మూవీలో కమెడియన్, యాక్టర్ సునీల్ ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌ అనే కీలక పాత్ర పోషించాడు. సునీల్‌తోపాటు వికాస్ వశిష్ట మరో ప్రత్యేక పాత్ర చేశాడు.

పైటర్ శివ నటీనటులు

వీరితోపాటు ఫైటర్ శివ సినిమాలో మధుసూదన్, యోగి కాట్రి, దిల్ రమేష్, లక్ష్మణ్, అభయ్, ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్, మాస్టర్ శన్విత్ నిమ్మల తదితర నటీనటులు నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయిన తర్వాత ఫైటర్ శివ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు మేకర్స్.

ఫైటర్ శివ టెక్నిషియన్స్

కాగా, ఈ సినిమాకు కెమెరా వర్క్‌ను సురేందర్ రెడ్డి, సంజీవ్ లోక్‌నాథ్ చేయగా.. గౌతమ్ రఘురాం సంగీతం అందించారు. ఎడిటింగ్ బాధ్యతలను విశ్వనాథ్ చేపట్టారు. ఇదిలా ఉంటే, ఇటీవల సంపత్ నంది సమర్పణలో వచ్చిన మైథలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2.

సీక్వెల్‌గా ఓదెల 2

సూపర్ హిట్ మూవీ ఓదెలకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఓదెల 2 సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్ర పోషించింది. తమన్నాతోపాటు వశిష్ట సింహా, హెబ్బా పటేలా, పూజా రెడ్డి, గగన్ విహారి, మురళి శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, దయానంద్ రెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఓదెల 2 బాక్సాఫీస్ వద్ద అంతగా ఆదరణ దక్కించుకోలేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఓదెల 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇకపోతే సంపత్ నంది డైరెక్టర్‌గా సాయి ధరమ్ తేజ్ హీరోగా గాంజా శంకర్ సినిమా ప్రస్తుతం ఆగిపోయినట్లు తెలుస్తోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం