సాయిధరమ్‌తేజ్ గాంజా శంకర్ ఆగిపోయినట్లు దర్శకుడు సంపత్ నంది అఫీషియల్‌గా ప్రకటించారు. సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత టైటిల్ మార్చమని తమకు పోలీసులు నోటీసులు పంపించారని సంపత్ నంది తెలిపాడు. సాయిధరమ్‌తేజ్‌తో పాటు తనకు, నిర్మాతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారని చెప్పాడు.
సాయిధరమ్‌తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ పేరుతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఓ సినిమాను అనౌన్స్‌చేశారు. ఈ సినిమా గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. గ్లింప్స్ రిలీజై ఏడాది దాటినా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. గాంజా శంకర్ ఆగిపోయినట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లపై ఓదెల 2 ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్ సంపత్ నంది క్లారిటీ ఇచ్చాడు. గాంజా శంకర్ ఆగిపోయింది నిజమేనని తెలిపాడు.
సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత టైటిల్ మార్చమని సాయిధరమ్‌తేజ్‌తో పాటు తనకు, నిర్మాతకు పోలీసులు నోటీసులు పంపించారని సంపత్ నంది అన్నాడు. టైటిల్ మార్చడం కంటే సినిమాను ఆపేయడమే మంచిదని అనిపించిందని సంపత్ నంది చెప్పాడు.
“మనం ఓ కథ అనుకుంటాం. అందులో కంటెంట్ ఏం చెప్పబోతున్నాం అన్నది నాకు తప్ప ఎవరికి తెలియదు. గాంజాకు వ్యతిరేకంగా ఈ కథను రాసుకున్నా. పోలీసుల దగ్గరకు వెళ్లి కన్వీన్స్ చేసి సినిమా చేయడం కరెక్ట్ కాదనిపించింది.మంచి సినిమా చేయాలని అనుకుంటే నోటీసుల వరకు వెళ్లింది. ఎవరినో కన్వీన్స్ చేసి సినిమా చేయడం కంటే నన్ను కన్వీన్స్ చేసుకుంటే మంచిది అనిపించింది. అందుకే సినిమా ఆపేశాం. గాంజా శంకర్ ఆగిపోయినా శంకరుడి మీదే మంచి కథ రాసి ఓదెల 2 సినిమా చేశా” అని సంపత్ నంది చెప్పాడు.
గాంజా శంకర్ ఆగిపోవడంతో సాయిధరమ్‌తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమాను అంగీకరించారు. దాదాపు 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియన్ లెవల్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది.
మరోవైపు సంపత్ నంది కూడా శర్వానంద్‌తో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీని అనౌన్స్‌చేశాడు. ఏప్రిల్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు తమన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఓదెల 2 మూవీకి సంపత్ నంది కథ, స్క్రీన్‌ప్లేను అందిస్తూనే ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ మూవీ రిలీజ్ కానుంది. డివోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా నాగసాధువు పాత్రలో కనిపించబోతున్నది. ఈ సినిమాలో తమన్నాతో పాటు హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సంబంధిత కథనం