Sampath Nandi Tamanna: తమన్నా లేడి సూపర్ స్టార్.. మరో 20 ఏళ్లు ఇలానే చేస్తుంది.. డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్-director sampath nandi comments on tamanna in odela 2 press meet says tamannaah bhatia is lady superstar of tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sampath Nandi Tamanna: తమన్నా లేడి సూపర్ స్టార్.. మరో 20 ఏళ్లు ఇలానే చేస్తుంది.. డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్

Sampath Nandi Tamanna: తమన్నా లేడి సూపర్ స్టార్.. మరో 20 ఏళ్లు ఇలానే చేస్తుంది.. డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Sampath Nandi Says Tamanna Is Lady Superstar Of Tollywood: తమన్నా లేడి సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ అని డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్ చేశారు. తాజాగా మార్చి 22న నిర్వహించిన ఓదెల 2 ప్రెస్ మీట్‌లో ఆ మూవీ క్రియేటర్ అయిన సంపత్ నంది సినిమా గురించి, తమన్నా భాటియాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తమన్నా లేడి సూపర్ స్టార్.. మరో 20 ఏళ్లు ఇలానే చేస్తుంది.. డైరెక్టర్ సంపత్ నంది కామెంట్స్

Sampath Nandi Says Tamanna Is Lady Superstar Of Tollywood: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2'. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ఓదెల 2లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో తమన్నా అలరించడానికి సిద్ధంగా ఉంది.

నాగ సాధువుగా తమన్నా

సూపర్ హిట్ అయిన 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్‌గా వస్తున్న ఓదెల 2 మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రానికి డైరెక్టర్ సంపత్ నంది క్రియేటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలో తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నారు. ఓదెల 2 టీజర్ అంచనాలని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది.

ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లలో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెల 2 మూవీ థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం (మార్చి 22) నాడు హారర్ థ్రిల్లర్ మూవీ ఓదెల 2 ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ తమన్నా, డైరెక్టర్ సంపత్ నంది, సినిమా దర్శకుడు అశోక్ తేజతోపాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.

ఆర్గానిక్‌గా రెస్పాన్స్

ఈ సందర్భంగా ఓదెల 2 మూవీ క్రియేటర్ సంపత్ నంది మాట్లాడుతూ.. "ఈ సినిమా టీజర్‌కి ఆర్గానిక్‌గా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. దీనికి కారణం మీడియా, ప్రేక్షకులు, లార్డ్ శివ. ఈ సినిమా గురించి మంచి మాటలు రాసిన మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను" అని అన్నారు.

"ఓదెల సినిమా నాకు ఒక ఎమోషన్. నేను ఆ ఊర్లో పుట్టి పెరిగాను. చాలా గౌరవంగా ప్రేమతో ఈ సినిమాని రాసి తీయడం జరిగింది. ఊరిని కాపాడేది ఆ ఊరిలో ఉన్న ఇలవేల్పు దేవుడి గుడి. ఒక లైన్‌లో చెప్పాలంటే.. ఓదెల విలేజ్‌లో ఒక కష్టం వస్తే ఆ కష్టం పెద్దదైతే ఆ ఊరిలో ఉన్న ఓదెల మల్లన్న నాగ సాధు క్యారెక్టర్ ద్వారా ఎలా పరిష్కరించారనే అనేది కథ" అని సంపత్ నంది తెలిపారు.

థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మూవీ

"కంటెంట్, స్క్రీన్ ప్లే, విజువల్ వండర్‌గా ఉంటాయి. సౌందర్ రాజన్ చాలా అద్భుతమైనటువంటి విజువల్స్ ఇచ్చారు. అజినీష్ అద్భుతమైన మ్యూజిక్ చేస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇది థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేసే సినిమా. సినిమా ప్రేమించే ప్రేక్షకులు ఎక్కడున్నా ఈ మూవీని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని సంపత్ నంది పేర్కొన్నారు.

"భైరవి పాత్రలో తమన్నా గారు చాలా అద్భుతంగా నటించారు. ఈ పాత్ర తమన్నా కోసమే పుట్టింది. ఆమెను వెతుక్కుంటూనే వెళ్లింది. 20 ఏళ్లుగా తమన్నా గొప్ప డెడికేషన్‌తో యాక్టింగ్ చేస్తూ సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఇది మామూలు జర్నీ కాదు" అని సంపత్ నంది చెప్పుకొచ్చారు.

20 ఏళ్లుగా టాప్ చైర్‌లో

"నేను పదేళ్ల క్రితం ఏ డెడికేషన్ తన (తమన్నా)లో చూశానో ఇప్పుడు కూడా అదే డెడికేషన్ తనలో ఉంది. అందుకే ట్వంటీ ఇయర్స్‌గా టాప్ చైర్‌లో కూర్చుని ఉంది. తను లేడీ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది. తను మరో 20 ఏళ్లు మనందరినీ ఇలానే ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను" అని ఓదెల 2 క్రియేటర్ సంపత్ నంది తెలిపారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం