Ram Gopal Varma On Posani Arrest Betting Apps Saaree Movie Release: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా 'శారీ'. ఈ చిత్రంలో సత్య యాదు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రల్లో నటించారు. శారీ మూవీని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు.
ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ శారీ సినిమాను నిర్మించారు. 'శారీ' సినిమా ఏప్రిల్ 4న తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా మార్చి 20న హైదరాబాద్‌లో శారీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. "మనం ఎవరితోనైనా డైరెక్ట్‌గా మాట్లాడినప్పుడు పెద్దగా వారితో కనెక్ట్ కాము. కానీ, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు మనం వారిని నేరుగా చూడటం లేదు గనుక త్వరగా వారితో కలిసిపోతాం. మన వ్యక్తిగతమైన విషయాలు కూడా చెప్పేస్తుంటాం" అని అన్నారు.
"ఒక్కోసారి ఎదుటివారికి దగ్గరయ్యాక భయం వల్లో సైకలాజికల్ ఫీలింగ్ వల్లో మరింతగా అటాచ్ అవుతాం. ఇలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం వల్ల ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 'శారీ' సినిమా నేపథ్యమిదే. ప్రాథమికంగా చూస్తే ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. నేను ఈ చిత్రానికి మూల కథ రాశాను. గిరి కృష్ణకమల్ దర్శకత్వం వహించాడు" అని ఆర్జీవి చెప్పారు.
"ఆరాధ్య చీరకట్టులో చేసిన ఒక రీల్ చూసి ఆమెను తీసుకున్నాం. ఆరాధ్య చేసిన పర్‌ఫార్మెన్స్ సూపర్బ్‌గా అనిపించింది. సత్య ట్రైన్డ్ యాక్టర్. తను బాగా నటించాడు. 'శారీ' సినిమాలో మెసేజ్ ఉంటుందని చెప్పను గానీ ఈ సినిమా చూశాక అమ్మాయిలు జాగ్రత్తపడతారు" అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.
"రాజకీయాలు, సినిమాలు వేరు. ఏపీలో మా 'శారీ' సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు. ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది. పోసాని గారిని అరెస్ట్ చేస్తే ఆయన సినిమాలు ఆపేయరు కదా. సోషల్ మీడియా మనుషులను దగ్గర చేసేందుకు తయారైంది. కానీ, ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఒకర్ని మరొకరు తిట్టుకోవడానికి పనికొస్తోంది. ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్ఛగా చెప్పడం వల్ల ఇలా జరుగుతోంది" అని ఆర్జీవీ పేర్కొన్నారు.
"నా సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా ఎప్పుడూ అడ్వర్టైజ్‌మెంట్స్ చేయలేదు. ఏ సంస్థకు యాడ్స్ చేసినా, అది లీగల్ సంస్థా కాదా అనేది యాక్టర్స్‌కు, స్టార్స్‌కు తెలియకపోవచ్చు. దానిపై అధికారులు నటీనటులకు అవగాహన కల్పించాలి. అంతేగానీ సడెన్‌గా చర్యలు తీసుకోవడం సరికాదు" అని బెట్టింగ్ యాప్స్ ప్రమోషనల్ చర్యలకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, శారీ సినిమాలో ఆరాధ్య దేవి, సత్య యాదుతోపాటు సాహిల్ సంభవ్, అప్పాజీ అంబరీష్, కల్పలత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇదివరకు విడుదలైన శారీ ప్రమోషన్స్, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
సంబంధిత కథనం