Madhuram: ఆటలు, అల్లర్లు, గొడవలు కళ్లకు కట్టినట్లు చూపిస్తూ తీశాం.. మధురం డైరెక్టర్ రాజేష్ చికిలే కామెంట్స్-director rajesh chikile comments on madhuram movie story and producer m bangarraju says nithin released teaser ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Madhuram: ఆటలు, అల్లర్లు, గొడవలు కళ్లకు కట్టినట్లు చూపిస్తూ తీశాం.. మధురం డైరెక్టర్ రాజేష్ చికిలే కామెంట్స్

Madhuram: ఆటలు, అల్లర్లు, గొడవలు కళ్లకు కట్టినట్లు చూపిస్తూ తీశాం.. మధురం డైరెక్టర్ రాజేష్ చికిలే కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

Director Rajesh Chikile About Madhuram Movie: తెలుగులో టీనేజ్ లవ్ స్టోరీగా వస్తోన్న కొత్త సినిమా మధురం. ఏ మెమొరబుల్ లవ్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. మధురం సినిమాకు రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 18న మధురం మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు డైరెక్టర్ రాజేష్ చికిలే.

ఆటలు, అల్లర్లు, గొడవలు కళ్లకు కట్టినట్లు చూపిస్తూ తీశాం.. మధురం డైరెక్టర్ రాజేష్ చికిలే కామెంట్స్

Director Rajesh Chikile About Madhuram Movie: యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన టీనేజ్ లవ్ స్టోరీ మూవీ మధురం. ఏ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్‌లైన్. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత యం బంగర్రాజు మధురం సినిమాను నిర్మించారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు

మధురం సినిమాకు రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్‌తో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో మధురం సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది.

ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా

ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. "శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత బంగార్రాజు గారు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అలాగే దర్శకుడు రాజేష్ అత్యద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మా కెమెరామెన్ మనోహర్ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ చేశారు" అని అన్నాడు.

క్లీన్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

"అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ సూపర్బ్ సాంగ్స్ ఇచ్చారు. మధురం ఏ మెమొరబుల్ లవ్.. ఇట్స్ ఏ క్లీన్ యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా నాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని హీరో ఉదయ్ రాజ్ తెలిపాడు.

కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా

"1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ లవ్ స్టోరీ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్లకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. సినిమా చూశాక అప్పటి వాళ్ల స్కూల్ డేస్.. కాలేజ్ డేస్ గుర్తుకు తెచ్చేలా ఈ మూవీ ఉంటుంది" అని డైరెక్టర్ రాజేష్ చికిలే చెప్పుకొచ్చారు.

అందరికి కనెక్ట్ అయ్యేలా

"ఎంతో కష్టపడి ఈ మధురం చిత్రాన్ని రూపొందించాం. మా నిర్మాత బంగార్రాజు మా వెన్నంటే ఉండి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. అలాగే మా డీవోపీ మనోహర్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది" అని అని మధురం దర్శకుడు రాజేష్ చికిలే పేర్కొన్నారు.

నితిన్ రిలీజ్ చేసిన

నిర్మాత యం బంగార్రాజు మాట్లాడుతూ.. "రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మధురం సినిమాను తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. ఏప్రిల్ 18న సినిమా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే నితిన్‌ గారు రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది" అని అన్నారు.

నా క్యారెక్టర్ అలరిస్తుంది

"ఇదొక ‌త్ ఫుల్ ఎంటర్టైనర్. ఇందులో నా క్యారెక్టర్ అందరిని అలరిస్తుంది. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్" అని మధురం హీరోయిన్ వైష్ణవి సింగ్ తెలిపింది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం