ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు.. చాలా చాలా అద్భుతమైన మూవీ..: ఓ చిన్న సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం-director rajamouli praises tourist family saying wonderful wonderful movie simran movie tourist family ott release date ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు.. చాలా చాలా అద్భుతమైన మూవీ..: ఓ చిన్న సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం

ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు.. చాలా చాలా అద్భుతమైన మూవీ..: ఓ చిన్న సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం

Hari Prasad S HT Telugu

దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడో చిన్న సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఇదో అద్భుతమైన మూవీ అని, అస్సలు మిస్ కావద్దని అతడు చెప్పడం విశేషం. తాను చాలా బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు.

ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు.. చాలా చాలా అద్భుతమైన మూవీ..: ఓ చిన్న సినిమాపై రాజమౌళి ప్రశంసల వర్షం

రాజమౌళి అంటేనే భారీతనానికి మారుపేరు. అతని సినిమాల్లో చాలా వరకూ భారీ బడ్జెట్‌వే. అలాంటి దర్శకుడు ఇప్పుడో చిన్న సినిమాను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఇది తప్పకుండా చూడాల్సిన మూవీ అని అంటున్నాడు. కేవలం రూ.14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. బాక్సాఫీస్ దగ్గర సూర్య నటించిన రెట్రోకే చెమటలు పట్టిస్తున్న సినిమా ఇది.

టూరిస్ట్ ఫ్యామిలీని మిస్ కావద్దు

తమిళ కామెడీ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. మే 1న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాను చూసిన రాజమౌళి.. తన ఎక్స్ అకౌంట్ ద్వారా చిన్న రివ్యూ ఇచ్చాడు. చాలా అద్భుతమైన సినిమా అని, అందరూ కచ్చితంగా చూడాలని అతడు అనడం విశేషం.

“ఓ అద్భుతమైన, అద్భుతమైన సినిమా టూరిస్ట్ ఫ్యామిలీ చూశాను. మనసుకు హత్తుకునే, చక్కిలిగింతలు పెట్టే హాస్యంతో కూడిన సినిమా. మొదటి నుంచి చివరి వరకూ ఆసక్తిగా చూశాను. అభిషన్ జీవింత్ గొప్ప రైటింగ్, డైరెక్షన్. ఈ మధ్యకాలంలో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చినందుకు థ్యాంక్యూ. ఈ సినిమా మిస్ కావద్దు” అని రాజమౌళి అన్నాడు.

టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ గురించి..

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో శశి కుమార్, సిమ్రన్ లీడ్ రోల్స్ లో నటించారు. శ్రీలంక నుంచి వచ్చి తమిళనాడులో సెటిలయ్యే ఓ చిన్న ఫ్యామిలీ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కొవిడ్ తోపాటు అక్కడి ఆర్థిక సంక్షోభాల నేపథ్యంలో ఆ కుటుంబం జాఫ్నాను వీడి తమిళనాడుకు వస్తుంది.

అప్పటి వరకూ అంటీ ముట్టనట్లుగా ఉండే అక్కడి వాళ్లు ఈ కుటుంబం వచ్చిన తర్వాత వాళ్ల ప్రేమానురాగాల కారణంగా ఓ మంచి కమ్యూనిటీగా మారిపోతుంది. ఈ క్రమాన్ని దర్శకుడు అభిసన్ జీవింత్ హాయిగా నవ్వుకునేలా చిత్రీకరించాడు. ఈ సినిమా సూర్య నటించిన రెట్రోతోపాటు రిలీజైనా.. తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీని మించి వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రావడం విశేషం.

టూరిస్ట్ ఫ్యామిలీకి ఐఎండీబీలో ఏకంగా 8.6 రేటింగ్ నమోదైంది. చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు. దీంతో మూవీ ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 31 నుంచి జియోహాట్‌స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం