Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కు ఎట్టకేలకు హీరో దొరికేశాడు. కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ ఓ మూవీ చేయనున్నట్లు కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియన్ లెవల్‌లో తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషల్లో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం.
కాగా విజయ్ సేతుపతితో చేయనున్న మూవీకి బెగ్గర్ అనే టైటిల్‌ను పూరి జగన్నాథ్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది. తెలుగు, తమిళ భాషలకు సూటయ్యేలా ఈ టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పూరి జగన్నాథ్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా సరికొత్త జానర్‌లో విజయ్ సేతుపతితో మూవీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడిగా తనను తాను నవ్య రీతిలో ఆవిష్కరించుకోవాలనే ఆలోచనతో ఛాలెంజింగ్‌గా పూరి జగన్నాథ్ ఈ సినిమా చేస్తోన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలొస్తున్నాయి.
పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతో విజయ్ సేతుపతి కూడా సింగిల్ సిట్టింగ్‌లోనే ఈ మూవీకి ఓకే చెప్పినట్లు తెలిసింది. పూరి మూవీ కోసం బల్క్‌గా డేట్స్ ఇచ్చినట్లు చెబుతోన్నారు. ఏప్రిల్ నెలాఖరున లేదా మే ఫస్ట్ వీక్‌లో పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
డబుల్ ఇస్మార్ట్ మూవీ పూరి జగన్నాథ్‌ను గట్టిగా దెబ్బకొట్టింది. రామ్ హీరోగా గత ఏడాది రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఇరవై కోట్ల లోపే కలెక్షన్స్ రాబట్టింది.
పూరి స్టోరీ, టేకింగ్‌పై దారుణంగా విమర్శలొచ్చాయి. డబుల్ ఇస్మార్ట్ మూవీని ఛార్మితో కలిసి పూరి స్వయంగా నిర్మించాడు. రెమ్యూనరేషన్ లేకుండా లాభాల్లో వాటా విధానంలో రామ్ ఈ మూవీని చేసినట్లు సమాచారం.
డబుల్ ఇస్మార్ట్ కంటే ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో పూరి జగన్నాథ్ కెరీర్ డైలమాలో పడింది. అతడితో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు ఎవరూ ముందుకు రాలేదని వార్తలొచ్చాయి.
మరోవైపు గత ఏడాది మహారాజాతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను సొంతం చేసుకున్నాడు విజయ్ సేతుపతి. ఇరవై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 190 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఏస్, ట్రైన్‌తో పాటు మరో సినిమా చేస్తోన్నాడు.
సంబంధిత కథనం