Killer: హీరోగా మారిన టాలీవుడ్ డైరెక్టర్.. గుప్పెడంత మనసు జగతి కిల్లర్ నుంచి ఫస్ట్ లుక్ అవుట్!
Killer Movie Poorvaj First Look Released: టాలీవుడ్ డైరెక్టర్ పూర్వాజ్ తాజాగా హీరోగా మారాడు. గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్‌తో పూర్వాజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కిల్లర్ మూవీ నుంచి పూర్వాజ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
Killer Poorvaj First Look Released: సినీ ఇండస్ట్రీలో హీరోలు డైరెక్టర్స్‌గా, కమెడియన్స్, దర్శకులుగా హీరోలుగా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా మరో టాలీవుడ్ డైరెక్టర్ హీరోగా మారారు. ఆయనే పేరే పూర్వాజ్. "శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్.
పూర్వాజ్ ఫస్ట్ లుక్
విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమాలను తెరకెక్కించిన పూర్వాజ్ రూపొందిస్తున్న మరో మూవీనే "కిల్లర్". యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న కిల్లర్ మూవీకి పూర్వాజ్ రచన, దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈ సినిమాతో పూర్వాజ్ హీరోగా మారారు. తాజాగా కిల్లర్ మూవీ నుంచి పూర్వాజ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
ప్రతి పోస్టర్‌తో క్యూరియాసిటీ
అయితే, కిల్లర్ మూవీని పార్ట్స్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్‌ను నవంబర్ 22న రిలీజ్ చేశారు. కిల్లర్ మూవీలో పూర్వాజ్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటోంది. చేతిలో రివాల్వర్‌తో పూర్వాజ్ కనిపిస్తున్నారు. ఇలా రిలీజ్ చేస్తున్న ప్రతి పోస్టర్‌తో కిల్లర్ మూవీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
జగతి పాత్రలో
ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్‌పై కిల్లర్ సినిమాను నిర్మిస్తున్నారు. పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబరేషన్‌లో నిర్మాణమవుతున్న రెండో సినిమా ఇది. కిల్లర్ సినిమాలో గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ హీరోయిన్‌గా నటిస్తోంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో జగతి పాత్రలో తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు జ్యోతి రాయ్.
జ్యోతి రాయ్ టు జ్యోతి పూర్వాజ్
అయితే, ఇటీవల జ్యోతి రాయ్ తన పేరును జ్యోతి పూర్వాజ్‌గా మార్చుకున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ తర్వాత వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటున్నారు జ్యోతి పూర్వాజ్. ఈ క్రమంలోనే కిల్లర్ మూవీలో హీరోయిన్‌గా చేస్తున్నారు జ్యోతి పూర్వాజ్. ఇటీవల కిల్లర్ మూవీ నుంచి రిలీజ్ అయిన జ్యోతి పూర్వాజ్ ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది.
రోబోగా జ్యోతి పూర్వాజ్
ఒక కత్తి పట్టుకుని అందులో డైరెక్టర్ పూర్వాజ్ ఫొటోతో ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది. మరోవైపు ఆ కత్తికి రక్తం ఉండటం, జ్యోతి పూర్వాజ్ ఒక కన్ను ఎలక్ట్రికల్ ఐగా కనిపించడం విశేషంగా అట్రాక్ట్ చేశాయి. కిల్లర్ మూవీలో జ్యోతి పూర్వాజ్ రోబోగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్
అందులో అందమైన యువతిగా జ్యోతి రాయ్ ముందు నుంచి కనిపిస్తే.. ఆమె వెనుక భాగం రొబోలా అద్దంలో కనిపించింది. ఈ పోస్టర్ కూడా వినూత్నంగా అట్రాక్ట్ చేసింది. కాగా కిల్లర్ మూవీకి సినిమాటోగ్రఫీ బాధ్యతలను జగదీశ్ బొమ్మిశెట్టి నిర్వహించగా.. అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం సంగీతం అందిస్తున్నారు.
టాపిక్