Nag Ashwin: ఆ రెండింటిని కలపడం వారివల్లే సాధ్యమైంది.. కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎమోషనల్ స్పీచ్
Nag Ashwin Emotional Kalki 2898 AD Trailer Release: డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోమవారం విడుదలైన కల్కి 2898 ఏడీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ రెండింటిని కలపడం వారి వల్లే అయిందని చెప్పారు.
Kalki 2898 AD Director Nag Ashwin Emotional: మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసిన కల్కి 2898 ఏడీ ట్రైలర్ ఫైనల్‌గా సోమవారం (జూన్ 10) సాయంత్రం 6 గంటలకు విడుదల అయిన విషయం తెలిసిందే.
'కల్కి 2898 ఏడీ' సినిమాటిక్ యూనివర్స్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా పరిచయం చేస్తూ రెండు నిమిషాల యాభై ఒక్క సెకన్ల నిడివి గల ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్లింది. టాప్ క్లాస్ సైన్స్ ఫిక్షన్, VFXతో అత్యద్భుతం అనిపించింది. ఈ సినిమా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ తో సహా పలు భాషల్లో చూసేందుకు అందుబాటులో ఉంచారు.
కల్కి ట్రైలర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "ఈ రోజు నా మనసు చాలా ఎమోషన్స్‌తో నిండి ఉంది. ఒక ఫిల్మ్ మేకర్‌గా ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా పాషన్. 'కల్కి 2898 AD'లో ఈ రెండు ఎలిమెంట్స్‌ని మెర్జ్ చేయడం (కలపడం) మా ఆర్టిస్ట్‌లు. టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది" అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలిపారు.
"ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది. మా నిర్మాతలు, స్టార్ కాస్ట్ నుంచి అద్భుతమైన క్రియేటివ్ మైండ్స్ ఉన్న కల్కి 2898 AD మొత్తం సిబ్బంది, ప్రతి వ్యక్తి ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేశారు. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎగ్జయిట్ చేసేలా ఉంటుందని మేము ఆశిస్తున్నాము" అని నాగ్ అశ్విన్ చెప్పుకొచ్చారు.
కాగా కల్కి 2898 ఏడీ సినిమాలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మల్టీలింగ్వెల్, మైథలాజికల్ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ఫ్యూచర్ బ్యాక్‌డ్రాప్‌తో మూవీ వస్తోంది. ఈ చిత్రం 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే, ఎలక్ట్రిఫైయింగ్‌గా ఉన్న కల్కి ట్రైలర్‌లో.. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్‌ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ తన అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా, అద్భుతంగా అదరగొట్టారు. ఎగ్జయిట్‌మెంట్‌ని మరింతగా పెంచుతూ ఫ్యూచర్ వెహికల్, బెస్ట్ ఫ్రెండ్ 'బుజ్జి'తో ప్రభాస్ తన పవర్-ప్యాక్డ్ యాక్షన్, కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు.
దీపికా పదుకొణె ప్రతి ఫ్రేమ్‌లో ఎమోషనల్ టచ్ ఇచ్చింది. ఇక దిశా పటాని తన అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. ప్రభాస్ పవర్-ప్యాక్డ్ డైలాగ్‌లు, అద్భుతమైన బీజీఎం, టాప్ క్లాస్ VFXతో, 'కల్కి 2898 AD' ట్రైలర్ ప్రేక్షకులు ఆడ్రినలిన్-ఫ్లూయిడ్‌తో కూడిన సినిమాటిక్ జర్నీని అందించింది.