The Birthday Boy: కడుపుబ్బా నవ్విస్తున్న ది బర్త్ డే బాయ్ టీజర్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్-director meher ramesh released the birthday boy movie teaser ravi krishna rajeev kanakala telugu comedy movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  The Birthday Boy: కడుపుబ్బా నవ్విస్తున్న ది బర్త్ డే బాయ్ టీజర్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్

The Birthday Boy: కడుపుబ్బా నవ్విస్తున్న ది బర్త్ డే బాయ్ టీజర్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్

Sanjiv Kumar HT Telugu
Jul 02, 2024 02:24 PM IST

The Birthday Boy Movie Teaser Released: రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ది బర్త్ డే బాయ్. ఇటీవల ది బర్త్ డే బాయ్ సినిమా టీజర్‌ను డైరెక్టర్ మెహర్ రమేష్ విడుదల చేశారు. ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఈ సినిమా టీజర్ కడుపుబ్బా నవ్వు తెప్పించేలా ఉంది.

కడుపుబ్బా నవ్విస్తున్న ది బర్త్ డే బాయ్ టీజర్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్
కడుపుబ్బా నవ్విస్తున్న ది బర్త్ డే బాయ్ టీజర్.. రిలీజ్ చేసిన డైరెక్టర్ మెహర్ రమేష్

The Birthday Boy Movie Teaser: ప్రస్తుతం ప్రేక్ష‌కుల అభిరుచి మారింది. కొత్త‌ద‌నంతో కూడిన న్యూ ఏజ్ సినిమాల‌కు వాళ్లు ప‌ట్టం క‌డుతున్నారు. అందుకే ద‌ర్శ‌కులు కూడా వారి ప‌ల్స్‌ను ప‌ట్టుకుని విభిన్న‌మైన క‌థ‌ల‌తో, వైవిధ్య‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా అదే కోవ‌లో మ‌రో విభిన్న‌మైన ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది.

ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ది బ‌ర్త్‌డే బాయ్‌. బొమ్మ బొరుసా ప‌తాకంపై నిర్మాణం జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి విస్కీ ద‌ర్శ‌కుడు. జూలై 19న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం టీజ‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్ విడుద‌ల చేశారు.

టీవీలో స్నేహితులు బాలుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఓపెన్ అయిన టీజ‌ర్.. ఆ త‌రువాత ప‌లు ఎంట‌ర్‌టైనింగ్ స‌న్నివేశాల‌తో కొన‌సాగుతుంది. టీజ‌ర్ చూస్తుంటే కొత్త‌ద‌నంతో కూడిన సినిమాలా అనిపిస్తుంది. టీజ‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రూ సినిమా చూడాల‌నే ఉత్సుక‌త‌ను క‌లిగించేలా టీజ‌ర్ క‌ట్ ఉంది. సినిమాలో బర్త్ డే విషెస్ చెబుతూ యాక్టర్స్‌తో వచ్చే సీన్స్ చాలా నవ్వు తెప్పించేలా ఉన్నాయి.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు చిత్ర విశేషాల‌ను తెలియ‌జేస్తూ ఇదొక కామెడీ డ్రామా అని, చిత్రంలోని ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైన్ చేస్తుందని, ప్ర‌తి పాత్ర‌, ప్ర‌తి స‌న్నివేశం కొత్త‌గా ఉంటుందని చెప్పారు. ఎం.ఎస్ చ‌ద‌వ‌డానికి విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఐదుగురు చిన్న‌నాటి స్నేహితుల‌కు జ‌రిగిన సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించామని ఆయన తెలిపారు.

"ఐదుగురు స్నేహితుల‌కు ఎదురైన అనుభ‌వాలు, వాటి ప‌ర్య‌వ‌సానాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఈ సినిమా స‌హ‌జ‌త్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రం ఉండనుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ప్ర‌య‌త్నించాం. త‌ప్ప‌కుండా చిత్రం అంద‌రికి న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ నెల 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం" అని డైరెక్టర్ విస్కీ తెలిపారు.

కాగా ది బర్త్ డే బాయ్ సినిమాలో ర‌వికృష్ణ‌, స‌మీర్ మ‌ళ్లా, రాజీవ్‌ క‌న‌కాల, ప్ర‌మోదిని, వాకా మ‌ని, రాజా అశోక్‌, వెంక‌టేష్, సాయి అరుణ్‌, రాహుల్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఐ.భ‌ర‌త్‌, డీఓపీగా సంకీర్త్ రాహుల్‌ చేయగా.. ప్ర‌శాంత్ శ్రీ‌నివాస్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌‌గా ఏఆర్ వంశీ.జి, ఎడిట‌ర్‌‌గా న‌రేష్ ఆడుపా బాధ్యతలు చేపట్టారు.

ఇక సినిమాలో వాడిన సింక్ సౌండ్ డిజైన్‌‌ను సాయి మ‌ణిధ‌ర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్‌‌ను అర‌వింద్ మీన‌న్‌ చూసుకున్నారు. ఇదిలా ఉంటే, ది బర్త్ డే బాయ్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసి తన సపోర్ట్ తెలిపారు డైరెక్టర్ మెహర్ రమేష్. ఈ సినిమా టీజర్ చాలా బాగుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ మూవీ తెరకెక్కించారు. ఇది బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది.

WhatsApp channel